సామాన్య ప్రజలకు కేంద్రం త్వరలో ఊరట కలిగించే వార్త చెప్పబోతోంది. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 వరకు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించబోతోంది. విపక్షాలకు వంటగ్యాస్ ధరలు ఆయుధంగా మారాయి. అతి త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. గ్యాస్ ధరలు జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న నివేదికలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రక్షా బంధన్ సందర్భంగా మోదీ ప్రభుత్వం చౌకైన ఎల్పీజీ సిలిండర్లను బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. మే 2022లో కూడా, కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో 12 సిలిండర్‌లను రీఫిల్ చేయడంపై ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీని ఇవ్వడం ప్రారంభించింది. దీని పదవీకాలం ఇప్పుడు మార్చి 31, 2024 వరకు పొడిగించారు. ఇదిలావుండగా ఈ పథకం కింద సిలిండర్లు పొందే వారు ఇప్పటికే రూ.900 వెచ్చిస్తున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉపశమనం కలిగించడానికి ఎల్పీజీ సిలిండర్‌పై అదనంగా రూ. 200 సబ్సిడీని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.