Nagative Campainers for YCP : వైసీపీని వేధిస్తున్న నెగెటివ్‌ క్యాంపెయినర్ల సమస్య !

0

 

వైసీపీకి సొంత పార్టీ నేతలే నెగెటివ్‌ క్యాంపెయినర్లుగా మారిపోయారు. టీడీపీ, జనసేనకు మద్దతుగా ఉన్న హీరోలు, నటులతో పాటు న్యూట్రల్‌గా ఉండే సినీనటులు కూడా వైసీపీకి దూరం జరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తన సంక్షేమ పథకాల కోసం కోట్ల వ్యయం చేసి మరీ ఇస్తున్న ప్రకటనల కంటే..  వైసీపీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై సినిమా వాళ్ళు చేసే విమర్శలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. స్వయంగా సీఎం బటన్‌ నొక్కుడు కార్యక్రమాల సందర్భంగా చేస్తున్న ప్రసంగాల కంటే సినిమా వాళ్ళ విమర్శలే ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా వైసీపీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కనీసం అభినందనలు కూడా తెలియజేయలేదు. దీంతో హార్ట్‌ అయిన సీఎం జగన్‌ తనదైన శైలిలో సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, తెచ్చిన జీవోలు వివాదాస్పదం అయ్యాయి.  దీంతో సినీ పెద్దగా మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున.. మహేష్‌, ప్రభాస్‌లతో కలిసి వెళ్లి ఒకసారి, నిర్మాతలతో మరోసారి సీఎం జగన్ని కలసి వచ్చారు. దీంతో జగన్‌ కొంచం మెత్తపడ్డారు. అంతే తప్ప సినిమా వాళ్ళేమీ జగన్‌ కోసం క్యూ కట్టి మద్దతు తెలిపింది లేదు. ఆ పరిస్థితి అలానే ఉన్నా కొంచెం బెటర్‌గా ఉండేదేమో కానీ, పోయి పోయి ఎన్నికల ఏడాదిలో వైసీపీ మరోసారి సినిమా వాళ్ళతో వైరం పెట్టుకోవటం చర్చనీయాంశం అవుతోంది. 

లాభం లేకపోయినా, నష్టం జరగకూడదు !

పవన్‌ విషయంలో ఎలాంటి విమర్శలు చేసినా ఓటర్లు పట్టించుకోకపోవచ్చు. కానీ రజనీకాంత్‌, చిరంజీవి విషయంలో వైసీపీ కాస్త పరిధి దాటి మాట్లాడిరది. వైసీపీ ప్రభుత్వం జోలికే రాని రజనీని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, చిరంజీవిపై పెద్ద ఎత్తున అటాక్‌ చేయడం ఇప్పుడు వైసీపీకి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. అర్థమైందా...రాజా ! అన్న ఒక్క డైలాగ్‌తో రజని ఎవరిని టార్గెట్‌ చేశారో అందరికీ అర్థం అయిపోయింది. సినిమా వాళ్ళ రెమ్యునరేషన్‌ గురించి రాజ్యసభలో చర్చించటం సమంజసం కాదు అన్ని చిరంజీవిని సైతం చెడుగుడు ఆడుకున్న వైసీపీ నేతలు చిరంజీవి సినిమాపై నెగెటివ్‌ ప్రచారం చేసి, ఆ చిత్రానికి రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వకుండా చేశారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్‌. ఎలక్షన్స్‌కు 10 రోజుల ముందు వారందరూ ఒక్కో డైలగ్‌ పేల్చినా, ట్విట్టర్‌లో ఒక్క మెసేజ్‌ చేసిన వైరల్‌ అవుతుంది. వైసీపీకి మైనస్‌ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దూకుడు రాజకీయాలు మంచివే, కానీ అన్నీ సార్లు కాదు. మంచి జరగక్కపోయినా పర్లేదు, నష్టం జరగకూడదు అనే సూత్రాన్ని వైసీపీ అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వైసీపీలో ఇప్పటికే అడపాదడపా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పోసాని కృష్ణ మురళి లాంటి వాళ్లు ఉన్నా వాళ్ల ప్రసంగాలు పార్టీకి నష్టమే చేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అంటే మొత్తంగా వైసీపీలో సినీ పరిశ్రమ నుంచి పార్టీకి మద్దతుగా మాట్లాడే వారంతా స్టార్‌ నెగిటివ్‌ క్యాంపెయినర్లుగానే చెప్పవచ్చు. ఇక సినీమాలతో సంబంధం లేకుండా వైసీపీ తరఫున తరచూ మీడియా ముందుకు వచ్చి దూషణల పర్వానికి తెరతీసే కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్‌ వంటి మాజీ మంత్రులు, మంత్రులను కూడా పరిశీలకులు స్టార్‌ నెగటివ్‌ క్యాంపెయినర్లుగానే అభివర్ణిస్తున్నారు. వీళ్లకి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న నెపంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన నలుగురు ఎమ్మెల్యేలూ కూడా వైసీపీకి స్టార్‌ నెగటివ్‌ క్యాంపెయినర్లుగా మారిపోయారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి  మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి లు కూడా వైసీపీకి స్టార్‌ నెగటివ్‌ క్యాంపెయినర్లుగా మారిపోయారు. వారు జగన్‌ సర్కార్‌ పై చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నది. మొత్తంగా వైసీపీకి పాజిటివ్‌ క్యాంపెయినర్ల కంటే నెగిటివ్‌ స్టార్‌ క్యాంపెయినర్లే ఎక్కువగా ఉన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !