Parliament Special Session In September : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు...ముందస్తుకు మోడీ ?

0

 

కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్‌ ఉంటాయని తెలిపింది. ఈ సమావేశాల్లో సత్ఫలితాలిచ్చే చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. 17వ లోక్‌ సభలో 13వ సెషన్‌, రాజ్య సభ 261వ సెషన్‌ జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్‌ ఉంటాయన్నారు. పార్లమెంటులో సత్ఫలితాలిచ్చే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

ఎందుకు ఈ పార్లమెంట్‌ సమావేశాలు 

ఈ సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచలేదు. ఈ సమావేశాలు నూతన పార్లమెంటు భవనంలో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. లోక్‌సభ, రాజ్య సభ సంయుక్త సమావేశం కూడా కాకపోవచ్చునని తెలుస్తోంది. అమృత కాలం సంబరాలు, ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత దేశం ఎదగడం గురించి చర్చ జరుగుతుందని కొందరు చెప్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా? అని కొందరు ఆలోచిస్తున్నారు. చంద్రయాన్‌-3 విజయవంతమవడం, ప్రతిపక్ష ఇండియా (I-N-D-I-A) కూటమి చకచకా పావులు కదుపుతుండటం, జీ20 (G-20) సమావేశాల అనంతరం ఈ ప్రత్యేక సమావేశాలు జరగబోతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా ? అనే కోణం కూడా వినిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బిల్లులన్నీ పెట్టి...ముందుస్తు ఎన్నికల కోసమే !

తాము పెట్టాలకుంటున్న బిల్లులతో పాటు ముందస్తు ఎన్నికల కోసం కేంద్రప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గ్యాస్‌ ధర రూ.200/` తగ్గింపు, త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌పై భారాన్ని తగ్గించేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనిస్తే డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగటం ఖాయం అని తెలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !