Rajinikanth Indirect Counter to YCP Leaders : వైసీపీ నేతలే టార్గెట్‌గా రజినీకాంత్‌ హాట్‌ కామెంట్స్‌ ? అర్థమైందా రాజా ?

0

మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండు జరగని ఊరు లేదు. అయినా మనం పట్టించుకోవద్దు. ఇలాంటి పట్టించుకోకుండా మన పని చూసుకొంటూ ముందుకు పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా? అంటూ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ జైలర్‌లో ఆడియో ఈవెంట్‌లో హాట్‌ కామెంట్స్‌ చేశారు రజినీకాంత్‌. అయితే ఈ కామెంట్స్‌ వైసీపీ నేతలపైనే అనే టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.అసలు రజినీకాంత్‌కి వైసీపీ నేతలపై విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వివాదం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 

రజినీని టార్గెట్‌ చేసిన  వైసీపీ నేతలు

ఇటీవల ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు రజినీకాంత్‌ హాజరయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడారు రజినీ. స్వర్గీయ ఎన్టీఆర్‌ గురించి, ఆయనతో అనుబంధం గురించి, అలాగే నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకొన్నారు. దీంతో వైసీపీ నేతలు రజినీకాంత్‌ను టార్గెట్‌ చేసి విమర్శించారు. ముఖ్యంగా మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని ఇద్దరు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అయితే రజినీకాంత్‌ కేవలం చంద్రబాబు నాయుడుని పొగిడారు తప్పా.. ఎక్కడా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆయన విమర్శలు చేయలేదు. వైసీపీ నేతల ఊసు ఎత్తలేదు.. అలాగే రెండు ప్రభుత్వాల పాలనను కంపేర్‌ చేయలేదు.. ఎక్కడా రాజకీయంగా మాట్లాడేలేదు.. కేవలం చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధం కారణంగా ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తారు.. మరి ఆ మాత్రం దానికే రజినీని ఎందుకు వైసీపీ నేతలు టార్గెట్‌ చేశారు. అది కూడా ఎవరూ ఊహించని రీతిలో తిట్ల దండకం అందుకున్నారు. అందుకే ఇప్పుడు రజినీకాంత్‌ ఇలా కౌంటర్స్‌ వేశారని అంటున్నారు ఆడియన్స్‌.

అయితే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ జైలర్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో గ్రాండ్‌ ఆడియో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ లో రజినీకాంత్‌ చేసిన హాట్‌ కామెంట్స్‌ మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. దాదాపు గంట సేపు వేదికపై మాట్లాడిన రజినీకాంత్‌.. వైసీపీ నేతలే టార్గెట్‌గా కొన్ని కామెంట్స్‌ చేసినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రజినీకాంత్‌ సినిమా విడుదలపై మరియు టికెట్ల రేట్లపై ఎలాంటి ప్రభావం చూపుతోంది చూడాలి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !