ఏడాదిలోనే నలుగురు ఆత్మహత్య
గత నెల 17న ఐఐటీ నుంచి అదృశ్యమై...విశాఖపట్నం బీచ్‌లో కార్తీక్ అనే బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాదిలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం భయాందోళనకు గురిచేస్తోంది. విద్యార్ధిని తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు, విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. 2022 ఆగస్ట్ 31న రాహుల్ అనే ఎంటెక్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం పాలయ్యాడు. గతేడాది సెప్టెంబర్ 6 న రాజస్థాన్ కు చెందిన మేఘా కపూర్ సంగారెడ్డిలో ఓ లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి కార్తిక్ గత నెల 17 న ఐఐటీ క్యాంపస్ నుంచి విశాఖపట్నం వెళ్లి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఒడిశాకు చెందిన మమైత నాయక్ హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం పాలైంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేలా క్యాంపస్‌లో యాజమాన్యం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. అయినా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం మరింత శ్రద్ధ వహించాల్సి ఉంది. లేదంటే ఐఐటి విద్య అంటే ఒత్తిడితో కూడుకున్నది అని పేరు వచ్చే ప్రమాదం లేకపోలేదు.