Video And Audio Calls Coming To Twitter X : ఫోన్‌ నంబర్‌ లేకుండా ఆడియో, వీడియో కాల్స్‌ - ట్విట్టర్‌ ఎక్స్‌లో కొత్త ఆప్షన్‌ !

0

 

ట్విట్టర్‌లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు ఎలాన్‌ మస్క్‌. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ X - ట్విట్టర్‌ మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. X లో తర్వలో ఆడియో, వీడియో కాల్‌ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు X సంస్థ బాస్‌ ఎలన్‌ మస్క్‌ తెలిపారు. ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఇంటిగ్రేటెడ్‌గా ఆడియో, వీడియో కాల్స్‌ వంటి ఫీచర్లను ఎక్స్‌ చూస్తుందని గురువారం ఎలోన్‌ మస్క్‌ ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫీచర్‌ కోసం ఎటువంటి సిమ్‌ కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఎక్స్‌ (ట్విట్టర్‌)లో కాల్‌ సదుపాయం తీసుకురానున్నట్లు చెప్పారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకు ఫోన్‌ నంబర్‌ అవసరం లేదన్నారు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్‌ బుక్‌కు ఎక్స్‌ వేదిక కానుందని.. ఇందులో ఫీచర్లన్నీ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. వీడియో కాల్స్‌ సదుపాయాన్ని తీసుకువచ్చే విషయంపై ఎక్స్‌ సీఈవో లిండా యాకరినో కొన్నిరోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

వీడియో కాలింగ్‌ ఆప్షన్‌

సంస్థలో డిజైనర్‌గా పనిచేస్తున్న ఆండ్రియా కాన్వే కూడా వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ఎలా ఉంటుందనే విషయాన్ని నెల క్రితమే ఓ చిత్రాన్ని షేర్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే ఎగువన కుడివైపున ఉండే డీఎం మెనూలో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఎక్స్‌లో బ్లూటిక్‌ హైడ్‌, లైవ్‌ వీడియో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.  ఎక్స్‌ అనేది ప్రభావవంతమైన గ్లోబల్‌ అడ్రస్‌ బుక్‌.. ఇది ప్రత్యేకమైనది’’ అంటూ మస్క్‌ ట్టిట్టర్‌ హ్యాండిల్‌ ఎక్స్‌లో రాశాడు. అయితే ఫీచర్ల లాంచ్‌ కి సంబంధించి ఎలాంటి తేదీ ఇవ్వలేదు. కానీ ఇందులోని ఫీచర్లన్ని యూనిక్‌ గా ఉంటాయని మస్క్‌ స్పష్టం చేశారు. జూలైలో కంపెనీ డిజైనర్‌ ఆండ్రూ కాన్వే ఈ ఫీచర్‌ను సూచించారు. కాన్వే ఒక నెల క్రితం చర్యలో ఉన్న ఫీచర్‌ స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. అప్పటినుంచి నెటిజన్లలో ఈ సౌకర్యాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న ఆసక్తి నెలకొంది.అయితే, ఎక్స్‌ను ఎవ్రీథింగ్‌ యాప్‌’ గా మారాలనే సంకల్పంతో ఎలోన్‌ మస్క్‌ ఆడియో, వీడియో కాల్‌ సౌకర్యాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మస్క్‌ తరచుగా మెటా బాస్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ఛాలెంజర్‌గా చూసుకుంటారు. ఫేస్‌బుక్‌ ఇతర సైట్ల తరహాలోనే ఎక్స్‌ని పెద్ద బ్లాగింగ్‌ సైట్‌గా మార్చాలనే దృష్టితో మస్క్‌ కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నారు.

 ఇప్పుడు గొప్ప సోషల్‌ నెట్‌వర్క్‌లు లేవు

ఈ నెల ప్రారంభంలో ఎక్స్‌లో ఎలోన్‌ మస్క్‌ ఒక పోస్ట్‌ చేసి కొన్ని విషయాలను చెప్పారు. ‘‘ఇప్పుడు గొప్ప సోషల్‌ నెట్‌వర్క్‌లు ఏవీ లేవు అనేది విచారకరమైన నిజం. చాలా మంది ఊహించినట్లు మేము విఫలం కావచ్చు.. కానీ అగ్రస్థానంలో కనీసం ఒకటి ఉండేలా చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము’’. అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆగస్ట్‌ 25న X ప్లాట్‌ఫారమ్‌లో ఆడియో, వీడియో ఫీచర్ల గురించి పోస్ట్‌ చేశారు. ఇందులో ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు 2 గంటల వరకు సుదీర్ఘ వీడియోలను పోస్ట్‌ చేయడానికి అనుమతించడం, మొబైల్‌ నుంచి మెరుగైన ప్రత్యక్ష ప్రసారం నాణ్యత. ఆండ్రాయిడ్‌, ఓఎస్‌లో వీడియో ప్లేయర్‌, కో-హోస్ట్‌లో మాట్లాడటం వంటివి ఉన్నాయి. వెబ్‌లో ఒక స్పేస్‌లో మిలియన్ల మంది పాల్గొనేవారికి మద్దతునిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !