Addagutta Building Collapse : నిబంధనలకు పాతర...అక్రమ నిర్మాణాల జాతర !

0

నిబంధనల ఉల్లంఘన నిండు ప్రాణాలను తీసింది. పర్మీషన్‌ ఇచ్చింది 5 అంతస్తులకు..కానీ కక్కుర్తితో మరో రెండు ఫ్లోర్లు అక్రమంగా వేస్తున్నారు.  ఫలితంగా ఆ రెండు ఫ్లోర్ల పనులు చేస్తుండగా....ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌ హైదర్‌ నగర్‌ డివిజన్‌ అడ్డగుట్టలో దాసరి సంతోష్‌, దాసరి శ్రీరామ్‌ అనే వ్యక్తులు సర్వే నెంబర్‌ 176, 177,182 లోని 668 గజాలలో భారీ భవన నిర్మాణం చేపట్టారు. దీనికి కూకట్‌పల్లి GHMC అధికారులు జీ ప్లస్‌ 5 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పటికే ఐదు అంతస్తులు పూర్తి అయింది.  కానీ బిల్డింగ్‌ ఓనర్లు..అనుమతి తీసుకోకుండానే మరో రెండు ఫ్లోర్లు అదనంగా వేయాలని ప్లాన్‌ చేశారు. ఓనర్లు దాసరి సంతోష్‌, దాసరి శ్రీరామ్‌ లు... బిల్డింగ్‌ డెవలప్‌ మెంట్‌ నిర్మాణ పనులను బిల్డర్‌ శ్రీనివాస్‌ నాయుడుకి ఇచ్చారు. అక్రమంగా 6, 7 అంతస్తుల నిర్మాణ పనులు మొదలయ్యాయి.  ఈ రెండు అంతస్తుల స్లాబ్‌ పోశారు. వీటి సెంట్రింగ్‌ తొలగిస్తున్న క్రమంలో పక్కకు ఒరిగిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో గోవా కట్టెలపై ఉండి పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కూలీలు అక్కడి నుండి కిందకు పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేటు  ఆస్పత్రికి తరలించారు. ఇంకొకరు స్వల్పంగా గాయపడ్డారు.

అక్రమ నిర్మాణాలకు అడ్డాగా హైద్రాబాద్‌...నిద్రపోతున్న GHMC !

ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయటం, బాధ్యులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవటం జీహెచ్‌యంసీకి పరిపాటిగా మారిపోయింది. ఆస్థి పన్ను వసూలు చేయటంలో ఉన్న శ్రద్ధ, నానాటికీ వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను నిలువరించటంలో ఏ మాత్రం శ్రద్ధ చూపటం లేదు. హైద్రాబాద్‌ శివార్లలో ఇదీ మరీ అంతకు అంత అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టు వ్యవహారించటం మూలంగానే నేడు ఇబ్బడిముబ్బడిగా అపార్ట్‌మెంట్‌లు వెలుస్తున్నారు. ఉప్పల్‌ శివార్లలోని ఒక ప్రబుద్దుడు 267 గజాల్లో ఏకంగా 4 అంతస్థులు నిర్మించాడు. భవనం చుట్టూ కనీసం ఒక మీటరు కూడా ఖాళీ వదలలేదు. కేవలం మున్సిపల్‌ పర్మిషన్‌తో 8 డబుల్‌ బెడ్‌రూమ్‌లు నిర్మించి అమ్మేస్తున్నాడు. లెక్కకు మిక్కిలిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధింత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులు నిర్భయంగా దందాలు సాగిస్తున్నారు. ఇవేమి తెలియని సామాన్యులు మోసపోతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌యంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు జోన్‌ వైజ్‌గా పర్యవేక్షించి అదనపు అంతస్థుల నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోకపోతే అక్రమార్కులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అమాయకులు మరింత మంది మోసపోయే ప్రమాదం ఉందీ. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !