AP CID Additional DG : స్కిల్‌ కేసులో కుంభకోణానికి చంద్రబాబే సూత్రధారి : ఏపీ సీఐడీ

0
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌పై ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్‌ స్పందించారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేశామని..స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లో రూ.550 కోట్ల కుంభకోణం జరిగిందని..ఈ స్కామ్‌ లో చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అందుకే అరెస్ట్‌ చేశామని తెలిపారు. ప్రభుత్వ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు దారి మళ్లించారని..షెల్‌ కంపెనీలకు రూ.317 కోట్లు తరలించారని వెల్లడిరచారు. ఈ నిధులను చంద్రబాబే విడుదల చేశారని..దానికి సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు చంద్రబాబు సూచనల మేరకే జరిగాయని దీనికి సంబంధించే ఆయనను అరెస్ట్‌ చేశామని వివరించారు. డిజైన్‌ టెక్‌ అనే కంపెనీకి దాని నుంచి ఇతర షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించారని దీనికి సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అందుకే అరెస్ట్‌ చేశామని వెల్లడిరచారు. క్యాబినెట్‌ ఆమోదం లేకుండానే స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని..నిధులు కాజేసేందుకు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. దురుద్ధేశంతోనే ఇది జరిగిందని అటువంటి ఉద్ధేశంతోనే సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టారని అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకు అందజేస్తామని తెలిపారు. అంతేకాదు ఈ కేసులో నారా లోకేశ్‌ను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్‌ తెలిపారు.

డిజైన్‌ టెక్‌ నుండి అనేక షెల్‌ కంపెనీలకు నిధుల మళ్ళింపు

ఈరోజు (సెప్టెంబర్‌ 9,2023)ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశామని తెలిపారు. ఈ స్కామ్‌ కు సూత్రధాని అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడేనని..ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ చాలా అవసరమని అందుకే అరెస్ట్‌ చేశామని వివరించారు. చంద్రబాబు పాత్ర ఉందనే విషయంలో ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయన్నారు. దీనికి సంబంధించిన తగిన ఆధారాలను కోర్టు ముందు పెడతామని తెలిపారు. ఈ స్కామ్‌ లో లబ్దిదారుడు చంద్రబాబేనని డిజైన్‌ టెక్‌ నుంచి అనేక షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించారని..కుంభకోణం చేయాలనే ఉద్దేశంతోనే స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. 2014లో జులై నాటికి స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని దీని ఏర్పాటు కంటే ముందే డిజైన్‌ టెక్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. డిజైన్‌ టెక్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ భాస్కర్‌ భార్య అపర్ణ ఉన్నారని..ఈమెను కార్పొరేషన్‌కు డెప్యూటీ సీఓగా నియమించారని తెలిపారు.ఈ ప్రజెంటేషన్స్‌లో అపర్ణ కూడా పాల్గొన్నారని..సీమెన్స్‌ నుంచి వస్తుందని చెప్పిన 90 శాతం నిధులు ఎందుకు రాలేదు అన్న కోణంలో ఆనాటి ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. ఏపీలో 6 చోట్ల 586 కోట్ల రూపాయలతో స్కిల్స్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని సాఫ్ట్‌ వేర్‌ కొనుగోలు కోసం 58 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు.ఈ రూ. 58 కోట్లతో కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ నే 3000 కోట్ల వ్యయంగా చూపించారని వివరించారు. ఇదే కీలకమైన కుట్ర కోణం అని అన్నారు. సెప్టెంబర్‌ 5న మనోజ్‌ పార్థసాని విదేశాలకు పారిపోయారని..యూఏఈ కి వెళ్ళినట్లు సమాచారం ఉందన్నారు.చంద్రబాబు పీఎ శ్రీనివాస్‌ కూడా అమెరికాకు వెళ్ళినట్లు మావద్ద సమాచారం ఉందన్నారు. వారి కోసం అమెరికా, యూఏఈ కి మా టీంలు వెళతాయని తెలిపారు. ఈ కేసులో కె. రాజేష్‌, నారా లోకేష్‌ పాత్రపై కూడా లోతుగా విచారణ చేస్తామని అన్ని వివరాలను కోర్టుకు అందజేస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !