Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

0

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పుని రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం ఇవాళ (సెప్టెంబర్‌ 22) తుది నిర్ణయాన్ని వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

తీర్పులో ముఖ్యంగా రెండు జడ్జిమెంట్లు 

చంద్రబాబు దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది కోర్టు. 17ఏ అని అనుసరించి కన్సర్డ్‌ అథారిటీ పర్మిషన్‌ తీసుకోలేదు కాబట్టి ఎఫ్‌ఐఆర్‌ చట్ట విరుద్ధం. ఎఫ్‌ఐఆరే చట్ట విరుద్ధం కాబట్టి చంద్రబాబు అరెస్ట్‌, జ్యుడీషియల్‌ రిమాండ్‌ కూడా చట్ట విరుద్ధం అని, చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దాని మీద ఇవాళ తీర్పు వచ్చింది. తీర్పులో ముఖ్యంగా రెండు జడ్జిమెంట్లు మెన్షన్‌ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పులను కోట్‌ చేస్తూ కీలక వ్యాఖ్యలు:

భజన్‌ లాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హర్యానా, నిహారిక ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్స్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసుల్లో ఇటువంటి పెద్ద కేసుల్లో 482 అప్లికేషన్లలో ఇన్వెస్టిగేషన్‌ లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. అలాగే కోర్టులు మినీ ట్రయల్‌ చేయకూడదు. అలాగే, ఈ సెక్షన్లు దీని మీద వర్తిస్తాయా లేవా అనేది కూడా కోర్టులు విచారించకూడదని చెప్పి ఈ మూడు ప్రిసిడెంట్స్‌ కు సంబంధించి భజన్‌ లాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హర్యానా, నిహారిక ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో.. ఆ తీర్పులను కోట్‌ చేస్తూ 140 మంది సాక్షులను విచారించాము అని సిఐడీ తరపు లాయరు వాదించారు.

ఈ సమయంలో జోక్యం చేసుకోలేము..

సాక్షుల స్టేట్‌ మెంట్లు కూడా రికార్డ్‌ చేశాము. 4వేల డాక్యుమెంట్స్‌ కలెక్ట్‌ చేశాము. కాబట్టి ఈ సమయంలో మీరు ఇన్వెస్టిగేషన్‌ లో వేలు పెట్టి చంద్రబాబుని విడుదల చేయడం వల్ల విచారణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, కాబట్టి ఈ సమయంలో దర్యాఫ్తులో మేము జోక్యం చేసుకోము అని చెబుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన క్వాష్‌ పిటిషన్‌ ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !