Bike Thefts : నాగోల్‌ మెట్రో పార్కింగ్‌లో బైక్‌ దొంగల స్వైరవిహారం !

0

ఇంటి ముందు పెట్టిన బైక్‌ మాయం చేస్తున్నారు. గుడిలోకి వెళ్ళిన పూజారి స్కూటీని ఎత్తుకెళ్ళిపోతున్నారు. మైట్రో స్టేషన్‌ పార్కింగ్‌లో బైక్‌ చోరీ చేస్తున్నారు, అర్జంట్‌ కాల్‌ మాట్లాడుతుండగా జనం మధ్య నుండి బైక్‌తో చేతిలో సెల్‌ ఫోన్‌ తస్కరిస్తున్నారు. ఉప్పల్‌ మరియు నాగోల్‌ ఏరియాల్లో ప్రతి రోజు ఇదే తంతు. రోజూ పదుల సంఖ్యలో బాధితులు పోలీస్‌స్టేషన్‌ మెట్లు తొక్కుతున్నారు. దొంగలు బరితెగించిస్వైర విహారం చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న బాధితుల ఫిర్యాదులను స్వీకరించి పంపించటం తప్పించి బాధితులకు న్యాయం జరగటం లేదు. 

కళ్ళు ఉన్నా చూడలేని కెమెరాలు !

దేశానికే ఆదర్శమైన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మన హైద్రాబాద్‌ పోలీసులకు ఉంది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పరిధిలో ఉన్న అన్ని సిసిటీవీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. మూడు విభాగాలుగా సిసిటీవీ కెమెరాలను ఇన్స్‌స్టాల్‌ చేశారు. సిటీ వైడ్‌ సర్వేలైన్స్‌ తో పాటు కమ్యూనిటీ సిసిటీవీ కెమెరాస్‌, సేఫ్‌ సిటీ సిసిటీవీ కెమెరాస్‌ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు లక్షలు సీసీ కెమెరాలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. ఇంత పెద్ద కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉన్నా స్థానికంగా పర్యవేక్షణ లోపాల కారణంగా సగానికి పైగా కెమెరాలు పనిచేయటం లేదు. కొన్ని బ్లర్‌గా కనిపిస్తుండగా, మరికొన్ని విద్యుత్‌ సరఫరా లేక కళ్ళు ఉన్నా చూడలేకపోతున్నాయి.ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. బైక్‌లు, సెల్‌ ఫోన్‌లు దోచేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో విధులు నిర్వర్తించే అధికారుల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారంతో పోలీసు సిబ్బంది సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు సరిపడా పోలీసు సిబ్బందిని నియమించవలసి ఉంది. లేకుంటే బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగే అవకాశం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !