హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగలు రెచ్చిపోతున్నారు. కెమెరాలు ఉన్నా బైక్ దొంగతనాలు ఆగటం లేదు. పట్టపగలు వందలాది మంది ప్రయాణిస్తున్న ఎంచక్కా దొరల్లా దొంగతనానికి పాల్పడుతున్నారు. ఆఫీసుకు పోయే హడావుడిలో పార్కింగ్ కోసం నానా హైరానా పుడుతూ ఉండే సగటు ఉద్యోగికి బైక్ దొంగలతో తల బొప్పికడుతోంది. ఒక వైపు ఆఫీసు టెన్షన్‌తో చచ్చి చెడి ఇంటికి వెళ్దామనే ఆనందంతో ఉన్న ఉద్యోగికి మెట్రో స్టేషన్‌లో బైక్ కనిపించకపోతే...ఆ ఊహించని షాక్‌కి ఏమి చేయాలో పాలుపోదు. ఈ చలాన్‌లో చెక్ చేసుకుంటే అందులో రిజిష్టర్ కాకపోతే మరింత టెన్షన్. బైక్ పోయింది అని కన్మర్మేషన్‌తో దిగాలుగా ఇంటికి పోవటం తప్ప ఇంకేమి చేయలేము. ఆ బైక్‌తో ముడిపడిన ఎన్నో జ్ఞాపకాలు ఒక ఫ్యామిలీ మెంబర్‌ని కొల్పొయిన బాధ. అంతకు మించి రూపాయిరూపాయి పోగేసి కష్టార్జితంతో కొనుకున్న బైక్ మిస్సయితే ఆ భాధ వర్ణతాతీతం. రోజుల తరబడి రెక్కీ నిర్వహించి బైక్ చోరీకి పాల్పడుతున్నారు.
నిమిషం కూడా గడవదు
మధ్యతరగతి ఉద్యోగికి బైక్ ఎంతో అవసరం. కాదు జీవితంలో ఓ భాగం. బైక్‌పై ఆధారపడి ఎన్నో పనులు చక్కబెట్టుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న సగటు ఉద్యోగికి బైక్ దొంగతనం తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. దొంగలకి ఏమి తెలుసు అది వారికి ఎంత అపురూపమో. దొంగకి ఆ రోజుకి 5000/`, 10000/` రావచ్చు. కానీ అవసరానికి బైక్ చేసే సాయం దానికి ఎన్నో రెట్లు పెద్దది. ఇప్పటికైనా బైక్‌లను జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాత బైక్స్ వాడే వాళ్ళు కొత్త లాక్స్ పెట్టించుకోండి. వెనుక వీక్‌కి మరో లాక్ వేయించుకోండి. కొత్త బైక్స్ వాళ్ళు లాక్స్‌ని వేసేటప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోండి. రెండు లాక్స్ వేస్తే మరింత సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ పోయింది అంటే మీరు పడే బాధ అంతా ఇంతా కాదు. ఒక తాళం అదనంగా వేయటం వల్ల వచ్చే నష్టం ఏమి లేదు. ఒక వేళ కార్ లేదా ఇతర వాహనం చోరీ అయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఎఫ్ ఐఆర్ ఫైల్ చేయండి..
వాహనం చోరీకి గురైందని మీరు గుర్తించగానే వెంటనే మీ వెహికిల్ డాక్యుమెంట్ ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీలతో వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడానికి పోలీసులు మీ నుంచి కొన్ని వివరాలు అడిగి తెలుసుకొని ఆ తర్వాతఎఫ్.ఐ.ఆం ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కాపీ మీకు అందజేస్తారు. ఈ కాపీ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది మీకు క్లెయిమ్ కోసం ఫైల్ చేయడానికి అత్యవసరం. అలాగే సంబంధిత Rుూ కి సమాచారమివ్వండి.ఎఫ్ ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వెంటనే మీ Rుూ (రీజియనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్) కి కూడా సమాచారం అందించాలి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇది తప్పనిసరి. ఇది మీ వాహనం వేరే వ్యక్తుల పేరు మీద ట్రాన్స్ ఫర్ కాకుండా కాపాడుతుంది.
ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయండి.
పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే మీకు ఇచ్చిన ఎఫ్ ఐఆర్ కాపీతో ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీ ఇన్య్సూరర్ కి దొంగతనం గురించి సమాచారం అందించాలి. క్లెయిమ్ కోసం అప్లై చేయడానికి మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు చాలా అందించాల్సి ఉంటుంది.ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్స్ కాపీ, ఎఫ్ ఐఆర్ ఒరిజినల్ కాపీ, క్లెయిమ్ ఫారం, మీ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, ఆర్ సీ బుక్ కాపీ, ఆర్ టీఓ ట్రాన్స్ ఫర్ పేపర్స్, ఇతర డాక్యుమెంట్స్, వీటితో పాటు మీ ఒరిజినల్ కార్ లేదా బైక్ తాళాలను కూడా అందించాల్సి ఉంటుంది.
నో ట్రేస్ రిపోర్ట్ తీసుకోండి.
మీరు కంప్లైంట్ ఇచ్చిన కొంత సమయం వరకూ పోలీసులు మీ వాహనం కోసం వెతుకుతారు. అయినా మీ వాహనం దొరకకపోతే కొంత కాలం తర్వాత నో ట్రేస్ రిపోర్ట్ ని అందిస్తారు. మీ వాహనం కోసం ఎంత వెతికినా దాని వివరాలు తెలియరాలేదని ఈ రిపోర్ట్ అర్థం. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మీ ఇన్స్యూరర్ మీ క్లెయిమ్ ని అంగీకరించి సాంక్షన్ చేస్తారు.ఎంత సమయం పట్టొచ్చు....సాధారణంగా పోలీసులు నో ట్రేస్ రిపోర్ట్ ఇవ్వడానికి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కనీసం ఒక నెల రోజుల సమయం తీసుకుంటారు. కొన్ని సార్లు మీ లొకేషన్, మీరు కంప్లైంట్ చేసిన సమయం వంటివి ఆధారంగా చేసుకొని మరికొంత ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు. ఇది ఇచ్చిన తర్వాత కనీసం 60 నుంచి 90 రోజుల తర్వాత ఇన్స్యూరర్ మీ వాహనం ఐడీవీ(ఇన్య్సూరర్ డిక్లేర్డ్ వ్యాల్యూ) ని మీకు అందజేస్తారు. ఇది మీ వాహనం ఎన్ని రోజుల క్రితం కొన్నారు.. దాని ప్రస్తుత పరిస్థితి ఆధారంగా ఇన్స్యూరర్ మీ వాహనానికి అందించే విలువ. మొత్తంగా మీ వాహనం దొంగిలించబడిన తర్వాత క్లెయిమ్ రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది.