TS BJP : తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌ !

0

  • పార్టీ మారేందుకు 5 గురు సీనియర్ల నిర్ణయం ?
  • అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో 5 గురు సీనియర్‌ లీడర్లు !
  • విజయశాంతి నివాసంలో మరోసారి భేటీ.

తెలంగాణ లో రోజుకు రోజుకు బిజెపి హావా తగ్గుతుందా..? అంటే అవుననే చెప్పాలి. ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో BRS vs BJP గా ఉండేది కానీ ఇప్పుడు BRS vs CONGRESS గా మారింది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు , బండి సంజయ్‌ ని అధ్యక్షా పదవి నుండి తొలగించడం రాష్ట్రంలో బిజెపిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. బండి సంజయ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షా పదవిలో ఉన్నప్పుడు బిఆర్‌ఎస్‌ తగ్గ పోరుగా బిజెపి పార్టీని నడిపించాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్‌ గా బండి సంజయ్‌ ని తప్పించడం..కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం అందర్నీ షాక్‌ లో పడేసింది. బిఆర్‌ఎస్‌, బిజెపి ఒక్కటే అని..బయటకు మాత్రమే కేంద్ర బిజెపి బిఆర్‌ఎస్‌ ఫై నిప్పులు చెరుగుతుందని..లోపల లోపల ఇద్దరు కుమ్మక్కయ్యారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది క్రమంలో కాంగ్రెస్‌ హావా పెరిగిపోతుండటంతో బిజెపి నేతలు సైతం అయోమయంలో పడ్డారు. బిజెపిని నమ్ముకుంటే ఏమి ఉండదని గ్రహిస్తూ..మెల్ల మెల్లగా ఆ పార్టీ నుండి బయటకు వచ్చేందుకు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ను, బిఆర్‌ఎస్‌ ను వీడిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిజెపి లోని ఐదుగురు కీలక నేతలు , మాజీ ఎంపీ లు కాంగ్రెస్‌ పార్టీ లోకి చేరేందుకు సిద్దమయ్యినట్లు తెలుస్తుంది.

ఖాళీ దిశగా బీజేపీ !

తాజాగా బీజేపీ నుంచి హస్తం గూటికి చాలా మంది నేతలు రానున్న ప్రచారం జోరుగా సాగుతోంది. గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సమావేశమైన సీనియర్లు మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. బీజేపీ వర్గాలు వెల్లడిరచిన సమాచారం ప్రకారం.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీలు వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్ఠానం వైఖరిపై చర్చించారు. బీఆర్‌ఎస్‌ పట్ల కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్ల బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని వారు అభిప్రాయపడ్డారు. ‘‘సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్యమకారులంతా బీజేపీ వైపు మొగ్గుచూపారు. అయితే, వారిని పార్టీ దూరం చేసుకుంటోంది. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదని అధినాయకత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది.. అయినా ఎందుకు జాప్యం జరుగుతుందో అంతుచిక్కడం లేదు’’ అని ఒకరిద్దరు నేతలు అన్నట్లు తెలిసింది. అధిష్ఠానం స్పందన కోసం రెండు, మూడు రోజులు వేచి చూడాలని, ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాశ్‌ జావడేకర్‌తో ఒకరిద్దరు సీనియర్‌ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొద్దిసేపు చర్చించారు. వారి ఆవేదనను అధినాయకత్వం దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. మాజీ ఎంపీ విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరితో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమై..తమ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ వీరంతా కాంగ్రెస్‌ గూటికి చేరితే..ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ కు తిరుగుందని అంత భావిస్తున్నారు. అతి త్వరలో వీరు కాంగ్రెస్‌ లో చేరతారని గట్టిగా చెపుతున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో.

డిసెంబర్‌లో ఎన్నికలు !

తెలంగాణలో డిసెంబర్‌ 07 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే ఎన్నికలకు పట్టుమని నాల్గు నెలల సమయం కూడా లేదు. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసల జోరు ఎక్కువైంది. అధికార పార్టీ బిఆర్‌ఎస్‌కు వరుస షాకులు ఎక్కువుతున్నాయి. బిఆర్‌ఎస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్‌ బాట పడుతున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ ప్రధాన నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరితే...కాంగ్రెస్‌కు తిరుగుండదు. ప్రజల మూడ్‌ని బట్టి నాయకులు అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్‌ సైతం చేరికల విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. ప్రతి ఒక్కర్ని పార్టీ లోకి ఆహ్వానిస్తూ బలం పెంచుకుంటుంది. స్వయంగా నేతల ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు హస్తం పార్టీ ముఖ్య నేతలు. రీసెంట్‌ గా తుమ్మల నాగేశ్వరరావు, కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి చేరికలే ఇందుకు నిదర్శనం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !