Jr. NTRని కట్టడి చేస్తున్న ఆదృశ్యశక్తి ఎవరు ?

0

 

కుటుంబం అన్నాక అభిప్రాయ భేదాలు, గొడవలు సహాజం. అంత మాత్రానికే ఎవరి దారి వారు చూసుకుంటారా ? అభిమానుల విషయంలో స్పందించే ఎన్టీఆర్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ కష్ట సమయంలో స్పందించడా ? 100% స్పందిస్తాడు. కానీ  కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దల జూనియర్‌ ఎన్టీఆర్‌ను స్పందించకుండా కట్టడి చేశారా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్‌ వంటి నాయకులపై ఆధారపడిన తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలంటే చంద్రబాబు, లోకేష్‌ను కేసులతో ఇక్కిరిబిక్కిరి చేయటమే లక్ష్యంగా అధికార వైసీపీ పార్టీ ఉచ్చుపన్నింది. దానికి తగినట్టే కార్యాచరణ చేపట్టింది. దీనికి కేంద్రప్రభుత్వ పెద్దల సహకారం ఉన్నట్లు  తెలుస్తోంది. అది నిజమే అన్నట్టు స్కిల్‌ స్కామ్‌లో అరెస్టుతో పాటు రిమాండ్‌ లో కొనసాగటం, మరోపక్క హైకోర్టులోనూ ఆయన తరఫున వేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయటం వంటి పరిణామాలతో చంద్రబాబు ఇప్పట్లో బయటికి వస్తారో లేదో అన్న డైలమాలో కేడర్‌ కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ఈ కేసులో లోకేశ్‌ని కూడా అరెస్ట్‌ చేస్తే ఆయన బయటికి రావడం కష్టమేనంటున్నారు. అంతేగాక ఇప్పటికే పాదయాత్ర రూపంలో రాష్ట్రమంతటా పర్యటిస్తున్నా లోకేశ్‌కి ఎలాంటి మైలేజీ దక్కలేదనేది పలువురు నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు విషయమే గమనిస్తే.. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతూ ఆయన్ని బయటికి రానీయకుండా జైలు లోపలే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించినా.. అనుభవం లేమి, వాక్‌ పటిమ లేకపోవడం, రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడం మైనస్‌లుగా మారుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి ఎన్నికలు వెళ్ళి ప్రజల ఆదరణ పొందాలని వేచి చూస్తోంది. 

తెలుగుదేశానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ దిక్కు !

ఎన్నికలు దగ్గరపడుతున్న ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి పటిష్టమైన నాయకత్వం కావాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ని మించినవారు లేరని కేడర్‌ భావిస్తున్నారు. నారా ఫ్యామిలీ అంటూ వారి చుట్టూ అల్లుకుని పార్టీని పూర్తిగా డ్యామేజ్‌ చేసుకోవడం కంటే నందమూరి వారి అసలైన బ్లడ్‌ అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే కేడర్‌లో ఉత్సాహం పొంగిపొర్లుతుందని, పార్టీకి జవజీవాలు వచ్చే అవకాశముంటుందని భావిస్తున్నారు. మరోపక్క చంద్రబాబుకు వయసు పెద్ద అడ్డంకిగా మారడం, లోకేశ్‌కి పాదయాత్ర చేసినా ఇమేజ్‌ పెద్దగా పెరగకపోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ని పార్టీలో కీలకం చేసి బాధ్యతలు అప్పగిస్తే జోష్‌ ఫుల్‌గా వస్తుందని, వైఎస్సార్‌సీపీ వంటి బలమైన పార్టీని ఢీ కొట్టడానికి జూనియర్‌కి మించిన లీడర్‌ ఉండరని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ముందే అంచనా వేసిన వైసీపీ జూనియర్‌ ఎన్టీఆర్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంలోని ఓ పెద్ద తలకాయ ద్వారా జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరంగా ఉండమని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కావాలని సూచించినట్టు తెలుస్తోంది. పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు, ఎన్టీఆర్‌ అవసరం నిజంగా అవసరమైనప్పుడు తన సినిమా కెరీర్‌ను సైతం లెక్కచేయడని ఎన్టీఆర్‌ స్వభావం తెలిసిన పలువురు అభిప్రాయపడుతున్నాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !