NCBN Enquiry : సుప్రీంలో బాబు క్వాష్‌ పిటీషన్‌ అక్టోబర్‌ 3కి వాయిదా !

0

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడిరది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ రోజే విచారించేలా లూథ్రా ప్రయత్నాలు...

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వారం పాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్‌ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనవంతు ప్రయత్నాలు చేశారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్‌వీఎన్‌ భట్టి చంద్రబాబు కేసును విచారించడానికి నిరాకరించినప్పటికీ ఏదో ఒక ధర్మాసనం ముందు ఈ రోజే విచారణకు వచ్చేలా చూడాలని ఆయన అన్ని ప్రయత్నాలు చేశారు. న్యాయవాది లూథ్రా వెంటనే సీజేఐ ధర్మాసనం ముందుకెళ్లారు. ఇందులో భాగంగా సీజేఐ ధర్మాసనం ముందు ఆయన వేచిచూశారు. వెంటనే వేరే ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్‌ విచారించాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. వేరే ధర్మాసనం కాకపోతే స్వయంగా సీజేఐ ధర్మాసనం వినాలని సిద్ధార్థ లుథ్రా అభ్యర్థించారు. కానీ ప్రయత్నాలు విఫలం అయినా కొంత ఊరట లభించింది. అక్టోబర్‌ 3న సీజేఐ ధర్మాసనం ముందు చంద్రబాబు కేసు మెన్షన్‌ చేయించుకోగలిగారు సిద్ధార్థ్‌ లూథ్రా. సంజీవ్‌ ఖన్నా ధర్మాసనంలోని జస్టిస్‌ ఎన్‌.వి ఎస్‌ భట్టి నాట్‌ బిఫోర్‌ మీ అన్న అంశాన్ని సీజేఐ దృష్టికి తెచ్చారు. అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ సీజేఐకి వివరించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !