సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు ఒక మూవీ తీయడానికి చాలా డబ్బులు ఖర్చుపెడుతూ ఉంటారు. మరికొందరు అయితే ఒక షాట్ పర్ఫెక్ట్ గా రావడానికి కొన్ని లక్షల్లో, కోట్లల్లో కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి ఈ ఇండస్ట్రీ లో సినిమా అనేది ఫైనల్ గా బాగా వచ్చిందా లేదా అనేదే చూస్తారు కానీ సినిమా లో ఒక సీన్ కోసం ఎంత ఖర్చుపెట్టారు అనేది ఇక్కడ ఎవరు చూడరు. అసలు విషయంలోకి వస్తే..అంటే రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమాలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది తెలంగాణ సదరన్ వేడుకకి సంబందించిన సీన్ కావడంతో దానికోసం ఒక దున్నపోతును ఈ సీన్ లో వాడటం జరిగింది. అది చూడటానికి చాలా పెద్దగా ఎత్తు గా ఉంది.దాంతో ఇది ఎక్కడిది అని చాలా మంది ఆరా తీస్తున్నారు అయితే ఇది ఆసియాలోనే అత్యంత విలువైన, పొడువైన, బరువైన దున్నపోతు అని తెలుస్తుంది. ఇక టీజర్ లో ఇది కనిపించినప్పటి నుంచే అది న్యూస్ లో నిలుస్తుంది దాని గురించి తెలుసుకోవడానికి చాలా మంది జనాలు ఉత్సహన్ని చూపిస్తున్నారు. సినిమా చూసిన జనాలు అయితే ఆ దున్నపోతు గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. మనం కూడా దాని గురించి తెలుసుకుందాం.
దానిపేరు యువరాజు !
ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఒక రైతు దగ్గర ఉంది. దీన్ని పెంచుకునే ఆ రైతు దీనికి యువరాజు అనే పేరు కూడా పెట్టాడు. ఇది ఏసియా లోనే అత్యంత పెద్ద దున్నపోతు ఇది హైట్ లో 5.8 అడుగులు ఉంటుంది, అలాగే పొడువులో 11.5 అడుగులు ఉంటుంది.ఇక దీని ఖరీదు 9 కోట్ల 25 లక్షలు అదేంటి ఒక దున్నపోతు కి అంత విలువ ఎందుకు అని అనుకుంటున్నారా అవును మీరు అనుకుంటున్నది కరెక్టే కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నెలకి 50 లక్షల రూపాయిల వరకు సంపాదిస్తుంది. ఎలా అంటారా ఇది ఆసియా ఖండం లోనే ఉన్న ఒకే ఒక మేలు రకం బ్రీడ్ దున్నపోతు కావడంతో ఈ బ్రీడ్ తో వచ్చిన గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయని ఎక్కువ మంది దీనికి ఎక్కువ మొత్తం లో డబ్బులు ఇచ్చి మరీ వాళ్ల గేదెల దగ్గరికి దీనిని తీసుకుపోవడం జరుగుతుంది. ఇలా ఇది నెలకి 50 లక్షల వరకు సంపాదిస్తుండటంతో దీనిని ఆ యజమాని ఎవ్వరికీ అమ్మకుండ తన దగ్గరే భద్రంగా ఉంచుకుంటున్నాడు. ఇక అందుకే బోయపాటి కూడ ఈ సినిమా షూటింగ్ కోసం ఈ దున్నపోతును తీసుకువచ్చి షూటింగ్ చేశాడు. ఈ ఒక్క సీన్ షూట్ చేయడానికి దాదాపు గా ఆ దున్నపోతు యజమానికి 26 లక్షల వరకు చెల్లించినట్లు గా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈ దున్నపోతు సీన్ ని థియేటర్ లో చూసిన ఆడియెన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇక దాంతో బోయపాటి ఈ దున్నపోతు మీద పెట్టిన మనీ కి కావల్సినంత మనీ ని ఈ సీన్ తీసుకు వస్తుంది అంటూ చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.