CM JAGAN : తన పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతున్నారా ?

0

  

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏ నలుగురు ఒక చోట కూడిన ఇదే చర్చ. సామాన్య ప్రజలతో పాటు మేధావుల వరకు అందరినోట ఒకటే మాట...చంద్రబాబుపై జగన్‌ ఎందుకు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు ? జగన్‌కి ఏం వచ్చింది పోయేకాలం ? ముసలోడు మీద ఏంటి కేసుల ప్రతాపం ? జగన్‌ అవినీతితో పోల్చితే చంద్రబాబుది అవినీతే కాదు ? అంటూ ఎవరికీ తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సానుభూతి విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని బలహీన పరిచి, ఎన్నికల బరిలోనే లేకుండా చేయాలనే లక్ష్యంతో జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న అరెస్ట్‌ల నిర్ణయం వైసీపీకి తీవ్ర నష్టం కలిగించేలా మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే 4 నెలల కాలంలో చంద్రబాబుతో పాటు లోకేష్‌, రామోజీరావు, కొలికపూడి శ్రీనివాసరావు, దేవినేని ఉమా... మరి కొందరు రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు, జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో యాక్టీవ్‌గా ఉన్న నాయకులను గుర్తించి వరస క్రమంలో జైలుకు పంపించే పనిలో జగన్‌ ఉన్నారని విశ్లేషిస్తున్నారు. తద్వారా ఎన్నికల సంగ్రామంలో ప్రత్యర్థి పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చి జగన్‌ పై చేయి సాధించాలనే తాపత్రయంతోనే ఇటువంటి వ్యూహాలకు తెరతీశారని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను కేసులు, జైళ్ళు, బెయిళ్ళు చుట్టు తిప్పుతూనే మానసికంగా దెబ్బకొట్టటమే జగన్‌ మోహన్‌ రెడ్డి ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా జగన్‌ ముందుకు వెళుతున్నారు. ప్రత్యర్థి పార్టీని బలహీన పరచటం, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం, నాయకులును జైలు పాలు చేయటం వంటి కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి ప్రత్యామ్నాయం లేదని,  జగన్‌కు దీటైన నాయకుడు లేడని నిరూపించే పనిలో బిజీగా ఉన్నారు. 

వెల్లువలా సానుభూతి !

జగన్‌ ఒకటి తలిస్తే ప్రజలు మరొకటి తలుస్తున్నారు. 74 సంవత్సరాల పెద్దాయనపై రాజకీయ కక్ష సాధించటం తగదని అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా ఒక్కసారిగా అరెస్ట్‌ వంటి చర్యలకు పాల్పడటంతో ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న జగన్‌...ఏది ఏమైనా తన నిర్ణయాలను అమలు పరిచే దిశగానే అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో అవినీతిపరుడుగా, జైలు పక్షిగా అభివర్ణించిన తెలుగుదేశం నాయకులందరినీ జైలు జీవితాన్ని పరిచయం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలతో పార్టీ గెలిస్తే ఓకే, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలులో వేయించిన పేరైనా మిగులుతుంది. అందుకే దూకుడుగా ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. ఇదే స్థాయిలో అరెస్ట్‌లకు పాల్పడితే వైసీపీ నాయకుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు వైసీపీ నాయకులు ఇలాంటి చర్యల వల్ల పార్టీకి తీరని నష్టం అని ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చంద్రబాబు అరెస్ట్‌ మరచిపోయేలా మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !