టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వట్టికుంట ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత, టీడీపీ నేత వట్టికుంట శేషగిరిరావు తీవ్రంగా ఖండిరచారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ కక్ష పూరితంగా జరిగిందన్నారు. అరెస్టు తీరు తెలుగు ప్రజలను కలిచివేసిందన్నారు. కక్షపూరిత రాజకీయాలను కూకటివేళ్ళతో పెకిలించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు ప్రజాస్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తండ్రి స్థాయి వయస్సున్న వ్యక్తిని వేధింపులకు గురిచేయటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదని విమర్శించారు. జైల్లో చంద్రబాబుకు భద్రత లేదన్నారు. జెడ్ కేడర్‌లో ఉన్న నేతను క్రిమినల్స్ ఉన్న సెంట్రల్ జైల్లో ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైద్రాబాద్ మరియు బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొనటం చూస్తుంటే చంద్రబాబు గొప్పతనం ఏంటో తెలుస్తుందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు పవన్ సంఫీుభావం తెలపటం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పవన్ చేసిన ప్రకటన టీడీపీ, జనసేన వర్గాలలో ఉత్సాహాన్ని నింపాయని వట్టికుంట శేషగిరిరావు పేర్కొన్నారు.
CBN ARREST : చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ కక్ష పూరిత చర్యే - వట్టికుంట శేషగిరిరావు
సెప్టెంబర్ 15, 2023
0
Tags