ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచుతోంది. ఈరోజు నర్సంపేట్ మెడికల్ కాలేజ్‌కు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు . జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలో మరెక్కడా లేదని, నర్సంపేటలో మెడికల్ కాలేజీ రావడం ఇక్కడి ప్రజల అదృష్టమని చెప్పారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ కోసం భూమిపూజ చేసి, గృహలక్ష్మి, దళిత బంధు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రొసీడిరగ్స్‌ను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ 1గా ఉందని ప్రశంసించారు.
తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్
కాళేశ్వరం, పాలమూరుతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, ఇక్కడి చెరువులు నిండుగా చేసుకున్నామని, దేవాదుల నీళ్ళు తెస్తా అని పెద్ది సుదర్శన్ అంటే, నాడు కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటామన్నారని, కేసీఆర్ చెబితే మాట తప్పడని, చేసి చూపించారన్నారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో తుమ్మలు తప్ప నీళ్ళు రాలేదని, నర్సంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని, తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉందని, నిరంతర కరెంట్ ఇవ్వడంలో నెంబర్ వన్, రైతు బంధు ఇవ్వడంలో నెంబర్ వన్ గా ఉందని, కాంగ్రెస్ హయాంలో మూడు ధర్నాలు ఆరు అరెస్టులతో విజృంభిస్తోందని, మెడికల్ కాలేజీ, చదువుతో పాటు వైద్యం అందుబాటులోకి వస్తుందని, ఎంజిఎం లాంటి ఆసుపత్రి నర్సంపేటకు వచ్చిందని మెచ్చుకున్నారు మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే 6 గ్యారెంటీలు కాదు, ఆరుగురు ముఖ్యమంత్రులు వస్తారని, మత కలహాలు, కొట్లాటలు వస్తాయని హెచ్చరించారు. 10 కోట్లకు పీసీసీ అధ్యక్షుడు టికెట్ అమ్ముకున్నారని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నారని, అధికారం కోసం ఎన్ని కుట్రలు అయినా చేస్తారని విమర్శించారు. టికెట్లు అమ్ముకున్న వాళ్ళు.. రాష్ట్రాన్ని అమ్ముకుంటారని, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీశ్‌రావు.
పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి.. ఆశీర్వదించండి.
— BRS Party (@BRSparty) September 28, 2023
- మంత్రి శ్రీ @BRSHarish #KCROnceAgain #VoteForCar pic.twitter.com/zymEfq7qF7