Motha Mogiddham : మోత మోగిద్దాం పేరుతో...నిరసనలకు తెలుగుదేశం పిలుపు !

0

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సెప్టెంబర్‌ 30న మోత మోగిద్దాం పేరుతో వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా సీఎం జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి,  నారా బ్రాహ్మణి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారిద్దరూ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకు మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణమిది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దాం’’ అని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

మీ నిశ్శబ్దాన్ని బ్రేక్‌ చేయండి: భువనేశ్వరి

మరోవైపు ఇదే అంశంపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం ట్వీట్‌ చేశారు. ‘‘చంద్రబాబు గారి మీద  తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేశారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్‌ చేయండి. శబ్దం చేయండి. చంద్రబాబు పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్ళకి చెప్పండి. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 నుండి  7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్‌ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉన్నా పరవాలేదు. వాహనం పక్కకు తీసుకుని హారన్‌ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేయండి.’’ అని విజ్ఞప్తి చేశారు.

అధికార మత్తు వదలేలా చేయాలి `నారా బ్రాహ్మణి

నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదన్నారు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అని అన్నారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని పిలుపునిచ్చారు. ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్‌ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్‌ వేయాలని కోరారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్‌ కొట్టాలన్నారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.

 ప్రజాశబ్దం వినిపిద్దాం: లోకేశ్‌

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ‘‘మోతమోగిద్దాం’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ... ‘‘అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు పెడితే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. చంద్రబాబుకు తెలుగువారంతా మద్దతిస్తున్నారని నిరూపించే సమయమిది. శనివారం రాత్రి ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం’’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !