Lokesh Nara : అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో ఏ14గా లోకేష్‌ !

0

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కేసులు, అరెస్టుల పర్వం నడుస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆయనతో పాటు మరో కేసులో ఆయన తనయుడు నారా లోకేష్‌ పేరును చేర్చటం హాట్‌ టాపిక్‌గా మారింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ 14గా నారా లోకేష్‌ పేరును  సీఐడీ చేర్చింది. ఏసీబీ కోర్టులో లోకేష్‌ పేరును మెన్షన్‌ చేస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది.

ఏ 14గా నారా లోకేష్‌ 

ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌లో ఇప్పటికే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు నారా లోకేష్‌ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొందరిపైనా అభియోగాలు ఉన్నాయి. వరుస కేసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. మరి తదుపరి అరెస్ట్‌ నారా లోకేష్‌దే అని ఊహగానాలు రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో లోకేశ్‌ పేరును చేర్చేందుకు ఉన్న ఆధారాలేంటి? ఏ కోణంలో చేర్చారు? తదితర విషయాలను సీఐడీ వెల్లడిరచాల్సి ఉంది. సీఐడీ మెమోపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను సీఐడీ చేర్చింది. నారాయణ ముందస్తు బెయిల్‌ పొందారు. ఈ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్‌ భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. తెదేపా ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌ లోకేశ్‌ వెంట ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌ పాలన, ప్రతిపక్షాల అణచివేత అంశాలను లోకేశ్‌.. రాష్ట్రపతికి వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !