ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించింది అంతం చేయడానికేనని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఆయనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘చంద్రబాబు గారిని సైకో జగన్ అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా జగన్ దే బాధ్యత’’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9
— Lokesh Nara (@naralokesh) September 21, 2023