Nara Bhuvaneswari : హెరిటేజ్‌ విలువ అంతా ?

0

 


నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి హెరిటేజ్‌ విలువ గురించి నోరుజారారా ? లేక నిజమే మాట్లాడారా అన్న విషయం పొలిటికల్‌ సర్కిల్స్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. దీంతో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు’ అంటూ హెరిటేజ్‌ కంపెనీని ఉద్దేశిస్తూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తాజాగా పేర్కొన్నారు.  ఆమె లెక్క ప్రకారం హెరిటేజ్‌ కంపెనీ విలువ రూ.20000కోట్లు. 

హెరిటేజ్‌ అసలు విలువ ఎంతంటే...

1992లో పెట్టిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి నారా భువనేశ్వరి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 2023 సెప్టెంబర్‌ 21 నాటికి హెరిటేజ్‌ కంపెనీ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.2,181 కోట్లు. 2023లో ఆ కంపెనీ రెవెన్యూ రూ.3,241 కోట్లు. ఇక నెట్‌వర్త్‌ చూసుకుంటే రూ.756 కోట్లు మాత్రమే. హెరిటేజ్‌ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 2,181 కోట్లు. అందులో 2 శాతం అంటే రూ. 21 కోట్లు. కానీ 2% అమ్మితేనే రూ.400 కోట్లు వస్తాయి అని ఏ లెక్కన మాట్లాడారు. కంపెనీలో చూపించని ఆస్తులు ఇంకా ఉన్నాయా ? లేదా హెరిటేజ్‌ కాకుండా వేరే కంపెనీలు ఏమైనా మాట్లాడారా ? అన్నది తేలాల్సి ఉంది. హెరిటేజ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెకు కంపెనీ విలువ తెలియకుండా ఉంటుంది. భర్త జైలు ఉన్నారన్న ఆవేదనతో ఉన్నా ఆమె మాటల్లో నిజం స్పష్టంగా వెల్లడవుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !