వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు అవకాశం ఎక్కువ. ఈ కాలంలో వర్షంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. ఈ మద్యకాలంలో కళ్ళకలక అందరినీ వేధించిన సమస్య. అలాగే వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌తో వివిధ రకాల జ్వరాలు అధికంగా వస్తుంటాయి. కావున వర్షాకాలంలో మాంసాహారానికి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. అయితే దీనిని పాటించడానికి ప్రధాన కారణాలు శాస్త్రీయతేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో నాన్ వెజ్ ఫుడ్ ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనమవుతుంది
వర్షాకాలంలో కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరిగడం వల్ల మాంసాహర తింటే పొట్టలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా నాన్-వెజ్ ఫుడ్ పేగులలో కుళ్లిపోయి ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి: వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీని కారణంగా వాతావరణంలో తేమ ఫంగస్, బూజు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. తద్వార దీని ప్రభావం మాంసాహర ఆహార పదార్థాలపై పడి.. త్వరగా పాడవుతాయి. భారీ వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి అనారోగ్యకరమైన వ్యాధులు కూడా వ్యాపించే అవకాశాలుంటాయి. కావున తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.
వానాకాలంలో పక్షులు, జంతువులు అనారోగ్యానికి గురవుతాయి
వర్షాకాలంలో కీటకాల సంఖ్య అధిక పరిమాణంలో పెరుగుతుంది. కానుక ఇది అనేక రకాల వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కలుషితమైన వాతావరణంలో జంతులు తిరగడం వల్ల వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారం తింటాయి. దీని వల్ల జంతువులలో కూడా ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. కావున ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జంతువుల మాంసం తినడం వల్ల మనకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
వర్షాకాలంలో చేపలు కూడా తినకూడదు
వానా కాలంలో సీఫుడ్ అరోగ్యానికి హానికరం. ముఖ్యంగా శ్రావణమాసంలో చేపలు, నీటిలో జీవించే ఇతర జీవులు గుడ్లు పెడతాయి. దీని కారణంగా వీటి శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు వస్తాయి. కావున ఈ సమయంలో సీఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి.వర్షాకాలంలో ఆలస్యంగా జీర్ణమయ్యే సీఫుడ్, జంక్‌ఫుడ్, నూనెతో కూడిన ఆహారం అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వీటిని తిన్న కొద్ది మోతాదులో తినడం మంచిది.