Salaar Relise Date : సలార్‌ దిగుతున్నాడు !

0

 


ప్రభాస్‌ అభిమానులకు పండగలాంటి వార్త. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ సలార్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ పై సస్పెన్స్‌కు తెరదించారు మేకర్స్‌. క్రిస్మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌ 22న సలార్‌ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్‌ 28న విడుదల కావాల్సిన సలార్‌ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ ఎట్టకేలకు సలార్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా  సినిమా రిలీజ్‌ డేట్‌ తో పాటు  ప్రభాస్‌ కొత్త పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేశారు.  ఇందులో ఒంటినిండా రక్తంతో చేతిలో కత్తి పట్టుకొని ప్రభాస్‌ కనిపిస్తోన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కాగా ఆదిపురుష్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న సలార్‌ సినిమాపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తోన్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.  ఇందులో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రేయా రెడ్డి, మధు గురుస్వామి, పృథ్వీరాజ్‌, రaాన్సీ, బ్రహ్మాజీ, జెమిని సురేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బ్రసూర్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

త్వరలోనే ట్రైలర్‌..

దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ సలార్‌ సినిమాను నిర్మిస్తోన్నాడు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. కాగా రెండు రోజుల నుంచి సలార్‌ సినిమా  గురించి సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. ఇప్పటికే మూడు హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండిరగ్‌లోకి వచ్చాయి. ‘ఎక్స్‌’లో ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ హవానే కనిపిస్తోంది.  కాగా ఇప్పటికే రిలీజైన సలార్‌ టీజర్‌ యూట్యూబ్‌ లో రికార్డులు కొల్లగొట్టింది. హీరోని  ఓ రేంజ్‌ లో ఎలివేట్‌ చేస్తూ ప్రముఖ నటుడు టీనూ ఆనంద్‌ చెప్పిన ఇంగ్లిష్‌’ డైలాగ్స్‌ అభిమానులతో విజిల్స్‌ కొట్టించాయి. త్వరలోనే ట్రైలర్‌ తో పాటు పాటలను కూడా రిలీజ్‌ చేయనున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !