అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు.. న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైంది’’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను కోడ్ చేస్తు లూథ్రా ట్వీట్ చేశారు. ఇదే నా నినాదం అంటూ లూథ్రా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా న్యాయం దొరకదు అనే అభిప్రాయానికి సిద్ధార్థ లూథ్రాకి వచ్చారా ? ఈయన వ్యాఖ్యలతో ఇప్పట్లో చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల పనితీరును ప్రత్యక్షంగా చూడటంతో పాటు అనుభవంలోకి రావటంతో సంక్షిష్ట పరిస్థితులను నెగ్గుకు రావటంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కత్తితీసి పోరాటమే సరైంది అన్న మాటలకు దేశవ్యాప్తంగా ఇక్కడి పరిస్థితులను తెలియజేయే దిశగా సుప్రీంకోర్టు ద్వారానే తెల్చుకోబోతున్నారా ? లూథ్రా వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటో కొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఇప్పటికే జాతీయస్థాయి నాయకుల సానుభూతి వ్యాఖ్యలతో దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఇది ఇలానే కొనసాగితే చంద్రబాబుకు సానుభూతి వెల్లువతో ఈజీగా గట్టేక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు సిద్ధార్థ లూథ్రా ఆంధ్రప్రదేశ్‌ని పరిస్థితులపై ఆవేదనతో ఉన్నట్లు ఒక్క ట్వీట్‌తో తేటతెల్లం అయ్యింది. ఆయన ఏ విధంగా ముందుకెళతారో చూడాలి.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023