Rajinikanth : చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు - ధైర్యం చెప్పిన రజనీకాంత్‌ !

0

చంద్రబాబును సపోర్ట్‌ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. టీడీపీ నేతలతో పాటు.. పవన్‌ కళ్యాణ్‌ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక నేటి ఉదయం.. చంద్రబాబు అరెస్ట్‌ పై నిర్మాత అశ్వినీదత్‌ స్పందించిన విషయం తెల్సిందే. ఇక తాజాగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సైతం చంద్రబాబుకు మద్దతు తెలిపాడు. నారా లోకేష్‌కు రజినీకాంత్‌ కాల్‌ చేసి మాట్లాడారు. నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు..చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష.. మీరేమి భయపడకండి.. ఖచ్చితంగా చంద్రబాబు బయటికి వస్తారు.. కుటుంబం జాగ్రత్త’’ అని లోకేష్‌ కు ధైర్యం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్‌ నెట్టింట వైరల్‌ గా మారింది. నందమూరి కుటుంబానికి రజినీ కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిమానంతోనే రజినీ.. ఈ మధ్య జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో పాల్గొని చంద్రబాబు గురించి మాట్లాడి వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. అప్పట్లో రజినీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికి తెల్సిందే. అయినా ఈ వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడని సూపర్‌ స్టార్‌.. అంత జరిగినా.. మిత్రుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి సపోర్ట్‌ చేయడం నిజంగా మంచి విషయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !