Vattikunta Seshagiri Rao : టాప్‌ బిజినెస్‌లీడర్‌గా గుర్తింపు పొందిన ధరణికోట వాసి వట్టికుంట శేషు !

0

 

ఆసియాలోని ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెన్స్‌ వ్యాపార వేత్తలపై సీఈఓ ఇన్‌సైట్స్‌ ఏసియా సంస్థ సర్వే చేసి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో పల్నాడు జిల్లా అమరావతి మండలం, ధరణికోట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువనేత, ఏబీఈఏఎం డైరెక్టర్‌ వట్టికుంట శేషగిరిరావు టాప్‌టెన్‌ జాబితాలో స్థానం సాధించారు. శేషగిరిరావు చేసిన సేవలను గుర్తించి టాప్‌టెన్‌ లీడర్స్‌ ఇన్‌ బిజినెస్‌ కన్సల్టెన్సీ ఇన్‌ ఏసియా `2023 అవార్డుకు ఎంపిక చేసింది. సింగపూర్‌లోని అబీమ్‌ కన్సల్టింగ్‌ సంస్థలో డైరెక్టర్‌గా సేవలు అందిస్తూ అత్యంత ప్రతిభావంతుడైన బిజినెస్‌ మ్యాన్‌గా ఖ్యాతినార్జించారు. ఆసియా ఖండంలో గ్లోబల్‌ వ్యాపారవేత్తల్లో తొలి పదిమందికిలో చోటు దక్కటంపై మండలంలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు వ్యాపారవేత్తగా రాణిస్తూనే, మరో వైపు వట్టికుంట ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పెదకూరపాడు నియోజకవర్గంలో తన సేవలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి ఆయన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది సమాజ్‌టుడే !

టాప్‌టెన్‌ లీడర్స్‌ ఇన్‌ బిజినెస్‌ కన్సల్టెన్సీ ఇన్‌ ఏసియాగా ఎంపిక అవ్వటం ఎలా ఉంది ?

శేషగిరిరావు : చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డ్‌ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావటం నాపై మరింత బాధ్యతను పెంచింది. ఏదైనా పనిచేసినప్పుడు గుర్తింపు వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు దోహదపడుతుంది. ఇప్పుడు నేను అదే ఫీలింగ్‌ని అనుభవిస్తున్నాను. 

వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు, మరో వైపు వట్టికుంట ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవలు చేస్తున్నారు ? ఏంటి ఆంతర్యం ?

శేషగిరిరావు : జీవితంలో ఎదగటం కోసం వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు అది అంతర్జాతీయస్థాయి గుర్తింపు నిచ్చింది. గుర్తింపు కోసం వ్యాపారం చేయటం లేదు. వ్యాపారం చేయటం మూలంగానే గుర్తింపు వచ్చింది అని భావిస్తున్నాను. ఇక సేవ అంటారా పుట్టి పెరిగిన నా జన్మభూమి మీద ప్రేమతో చేస్తున్నాను. నా గ్రామం, నా మండలం, నా నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపకు చేరువ కావటమే వట్టికుంట ఛారిటబుల్‌ ట్రస్ట్‌ లక్ష్యం.  విద్య, వైద్యం సామాన్యులకు అందాలనే తలంపుతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. 

వ్యాపారమా ? సేవా ? ఏది ముఖ్యం అంటే మీ సమాధానం !

శేషగిరిరావు : వ్యాపారం, సేవ రెండూ...నాకు రెండు కళ్ళు !

రాజకీయాల్లో రాణించాగలననే నమ్మకం ఉందా ?

శేషగిరిరావు : సింగపూర్‌లో వ్యాపారాలను కొనసాగిస్తూ హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చు.కానీ పుట్టి పెరిగిన ఊరికి, ముఖ్యంగా మన నియోజకవర్గానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులతో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ దేశాలు ఎప్పటిప్పుడు ప్లానింగ్‌ చేసుకుంటూ ముందుకు పోతున్నాయి. మనం మాత్రం అక్కడే ఉంటున్నాము. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. యువతకు, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే రాజకీయాలతోనే సాధ్యం. అందుకే బిజినెస్‌ చూసుకుంటూనే రాజకీయాల్లోకి వస్తున్నాను. రాజకీయాల్లోనూ సక్సెస్‌ అవుతాననే నమ్మకం ఉంది.

2024 ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది ?

శేషగిరిరావు : చేయాలనే ఆలోచనైతే ఉంది. కానీ చంద్రబాబుగారు, లోకేష్‌ గారి ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధం. చివరి క్షణం వరకు సీటు సాధించే ప్రయత్నం అయితే చేస్తా.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !