Allu Arjun : నేషనల్‌ అవార్డు అందుకున్న ఐకాన్‌ స్టార్‌

0

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం నేడు అక్టోబర్‌ 17న ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా విజేతలు అందరూ తమ అవార్డులను అందుకున్నారు. ఇక ఈ ఏడాది అల్లు అర్జున్‌ బెస్ట్‌ యాక్టర్‌ కి ఎన్నికైన సంగతి అందరికి తెలిసిందే. పుష్ప సినిమాలో తన నటనకు గాను బన్నీ ఈ అవార్డుని అందుకుంటున్నాడు. టాలీవుడ్‌కి ఈ అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఇన్నేళ్ల టాలీవుడ్‌ చరిత్రలో పలు క్యాటగిరీల్లో తెలుగు సినిమా జాతీయ పురస్కారం అందుకున్నప్పటికీ ఉత్తమ నటుడు అవార్డు మాత్రం మొన్నటి వరకు తీరని కలల ఉంది. ఆ కలని అల్లు అర్జున్‌ నెరవేర్చాడు. అది కూడా ఒక కమర్షియల్‌ సినిమాతో నేషనల్‌ అవార్డుని అందుకొని గ్రేట్‌ అనిపించాడు. 

తీరని కలని అల్లు అర్జున్‌ నెరవేర్చాడు

ఈ పురస్కారానికి అల్లు అర్జున్‌తో పాటు అల్లు అరవింద్‌, బన్నీ సతీమణి స్నేహ రెడ్డి కూడా వెళ్లారు. అల్లు అర్జున్‌ అవార్డు అందుకోవడానికి స్టేజి పైకి వెళ్లిన సమయంలో వీరిద్దరూ తమ ఫోనుల్లో.. ఈ అరుదైన దృశ్యాన్ని బంధించే ప్రయత్నంలో పడ్డారు. ఆ సమయంలో అరవింద్‌, స్నేహారెడ్డి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇక వేడుకలో వారంతా కరతాళధ్వనులతో అల్లు అర్జున్‌ని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది.కాగా అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ మూవీ ప్రమోషన్స్‌ సమయంలో.. కమర్షియల్‌ సినిమాతోనే తెలుగు సినిమాకి నేషనల్‌ వైడ్‌ గుర్తింపుని తీసుకు వస్తానని చెప్పుకొచ్చాడు. అప్పుడు అలా చెప్పాడో లేదో.. మూడేళ్ళలో ఇలా నిజం చేసి చూపించాడు. ఇక నేషనల్‌ అవార్డుని అందుకోవడంతో టాలీవుడ్‌ ప్రముఖులు బన్నీకి సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !