Chandrababu : చంద్రబాబుకు బెయిల్‌...షరతులు వర్తిస్తాయి !

0

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడిరచారు. నవంబర్‌ 10న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.  

షరతులు వర్తిస్తాయి.

హైకోర్టు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు చం‍ద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో పలు షరతులు విధించింది. ‘‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్‌ గడువు ముగిశాక నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు’’అని తీర్పు సందర్భంగా బెంచ్‌ తెలిపింది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం స్కిల్‌ స్కామ్‌ కేసులో.. అదీ కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్‌ మంజూరు అయినట్లు తెలుస్తోంది. అలాగే నవంబర్‌ 10న ఈ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !