BJP Janagarjana : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.

0

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కుమురం భీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్‌ షా..  పవిత్ర భూమి ఆదిలాబాద్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. డిసెంబరు 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్‌ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి కేసీఆర్‌ సర్కారు జాగా చూపించలేదు.. ఆందుకే ఆలస్యమైంది. మోదీ.. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు. పదేళ్లుగా కేసీఆర్‌ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. కేసీఆర్‌.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించింది’’ అని అమిత్‌ షా తెలిపారు.

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు..

ప్రతి పేద మహిళకు మోదీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చారు. రైతుల ఖాతాల్లో ఏటా రూ.6వేలు జమ చేస్తున్నాం. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోదీ.. రాష్ట్రపతిని చేశారు. కాంగ్రెస్‌ పేదల గురించి మాట్లాడుతుంది కానీ.. పేదల కోసం ఏమీ చేయదు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని వస్తారు. 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. కేసీఆర్‌ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదు. ఆదివాసీలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? దళితులు, గిరిజనుల కోసం మోదీ తొమ్మిదేళ్లుగా ఎన్నో కార్యక్రమాలుచేపట్టారు. కేసీఆర్‌ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు’’ అని అమిత్‌ షా విమర్శించారు.

రామమందిరం నిర్మాణం...

‘‘అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోదీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది. ఆర్టికల్‌ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించింది. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నిర్వహించి శత్రువులను తరిమికొట్టింది. తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ చేశానని కేసీఆర్‌ చెబుతుంటారు.. రైతుల ఆత్మహత్యల విషయంలో, అవినీతి విషయంలో తెలంగాణను నెంబర్‌వన్‌ చేశారు. కేసీఆర్‌ ఎన్నికల గుర్తు కారు.. కానీ, ఆ కారు స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ  దగ్గర ఉంటుంది. ఎంఐఎం దగ్గర స్టీరింగ్‌ ఉన్న భారాస సర్కారు అవసరమా?. మోదీ సర్కారు ఉచితంగా టీకాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కరోనా నుంచి కాపాడిరది. కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు చెబుతున్నారు. చంద్రశేఖర్‌రావూజీ.. దళితులకు మూడెకరాల భూమి హమీ ఏమైంది. ఆధునిక రజాకార్‌ల నుంచి తెలంగాణను భాజపా మాత్రమే కాపాడుతుంది’’ అని అమిత్‌ షా అన్నారు. 

ధర్మానికి  అడ్డా.. ఆదిలాబాద్‌ గడ్డ: బండి సంజయ్‌

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చేది మోదీ రాజ్యమేనని .. ఎవరూ ఆపలేరని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ‘‘నిజాం మెడలు వంచి హైదరాబాద్‌కు స్వాతంత్య్రం తెచ్చిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు దక్కింది. అమిత్‌ షా ఆధునిక సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. కేసీఆర్‌ నా గురువు.. ఆయన వద్దే భాష నేర్చుకున్నా. రాష్ట్రం బాగుపడాలంటే పేదల రాజ్యం రావాలి. ధర్మానికి  అడ్డా.. ఆదిలాబాద్‌ గడ్డ’’ అని బండి సంజయ్‌ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !