BJP Lifted Suspension : ఎమ్యేల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

0

BJP Lifted Suspension on MLA Rajasingh : శాసనసభ ఎన్నికల అభ్యర్థిత్వాల ప్రకటనకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)కీలక నిర్ణయం తీసుకొంది. గోషామహల్‌ శాసన సభ్యుడు రాజాసింగ్‌పై (RajaSingh) సస్పెన్షన్‌ ఎత్తివేసింది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయనపై పార్టీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సస్పెండ్‌ చేసింది. ఆగస్టు 23 2022న రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి వివరణ కోరింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిత్వాల ఖరారు సందర్భంగా రాజాసింగ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసింది. రాజాసింగ్‌ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొని సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు పార్టీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్‌ తెలిపారు. గోషామహల్‌ నుంచి పోటీ చేస్తానని రాజాసింగ్‌ గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే శాసనసభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. అందులో రాజాసింగ్‌ పేరు కూడా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడంపై రాజాసింగ్‌ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. గోషామహల్‌లో తిరిగి గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం అండగా నిలబడిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు రాజాసింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అసలేం జరిగిదంటే 

గతేడాది ఆగస్టులో ఓ వర్గంపై రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఒక వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడారని ఖాదర్‌ఖాన్‌ అనే వ్యక్తి మంగళ్‌​హాట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజాసింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేశాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !