Bandaru Satyanarayana : మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యల ఫలితం !

0

అనుకున్నదే అయ్యింది, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు. తొలుత అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆయనను మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మళ్లీ ప్లాన్‌ మార్చిన పోలీసులు.. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. మరో వైపు వైఎస్‌ఆర్‌సీపీ యం.పి. రఘురామకృష్ణంరాజు మాదిరిగానే పోలీసుల నుండి గట్టి ట్రీట్‌మెంట్‌ ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి తప్పకుండా బయటపడతానని బండారు స్పష్టం చేశారు. ధర్మం తప్పనిసరిగా గెలుస్తుందన్నారు.

అర్ధరాత్రి నుంచి హైడ్రామా

బండారు ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఆ క్రమంలోనే పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా బండారు ఇంటికి తరలివచ్చారు.

గేటు దూకి మరీ..

అర్ధరాత్రి తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరమేంటని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఉద్రిక్తత కొనసాగింది. అయితే, బండారుకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చేందుకు.. పలువురు పోలీసులు గేటు దూకి మరీ ఇంట్లోకి వెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ఆందోళనకు దిగారు. మరోవైపు బండారు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !