- 65 సీట్లు రూ.600 కోట్ల అమ్మకం !
- రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ కార్యదర్శి సంచలన ఆరోపణ.
రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమికి గద్వాల టికెట్‌ను పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమ్ముకున్నారని టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ (Kuruva Vijvay Kumar) ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ (Gun Park) వద్ద ఆయన ఆందోళన చేపట్టారు. ‘నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు’ అంటూ తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ రెడ్డి (Revanth Reddy) 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. వెంటనే రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. ప్రకటించిన తొలి జాబితాను ప్రక్షాళన చేయాలి’’ అని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.