Nara Lokesh : అన్యాయంగా మా నాన్నను జైల్లో పెట్టారు ! నారా లోకేష్‌ కంటతడి !

0

 


స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు విషయంలో ఆయన తనయుడు నారాలోకేష్‌ కంట తడిపెట్టిన ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ నాడు తప్పు చేయలేదని... చంద్రబాబు ప్రజల కోసమే నిస్వార్థంగా పని చేశారని అన్నారు.  స్కిల్‌ కేసులోని నిందితులు అందరికీ  38 రోజులకే బెయిల్‌ మంజూరైతే.. చంద్రబాబుకు రిమాండ్‌ విధించి 43 రోజులైనా ఇంతవరకు బెయిల్‌ రాలేదన్నారు.  చంద్రబాబు నాయుడు 43 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తలచుకుంటేనే దు:ఖం తన్నుకొస్తోందన్న నారా లోకేష్‌. తెలుగుదేశం-జనసేన పోరాడకుంటే రాష్ట్రాన్ని జగన్‌ ముక్కలు చేసి అమ్మేసేవాడని మండిపడ్డారు. తెలుగుదేశం-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే సంపాదించాలని చంద్రబాబు భావిస్తే రాజకీయాలు అవసరం లేదన్నారు.  చివరకు తన తల్లి  భువనేశ్వరిపై కూడా కేసులు పెడతామని కొంతమంది బెదిరిస్తున్నారని లోకేష్‌ భావోద్వేగానికి గురయ్యారు.  

జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు

‘‘2019లో ఒక్క ఛాన్స్‌ అంటే జగన్‌ను గెలిపించారు. నియంత మాదిరిగా జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేశారు. సైకో జగన్‌ మొదటి నిర్ణయం.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చడం. దళితులు, బీసీలు, మైనారిటీలు, అనేకమంది తెదేపా నాయకులపై వేల కేసులు పెట్టించారు.  రాష్ట్రానికి చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. వేలమంది నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించారు. పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగాలు కల్పించినందుకు చంద్రబాబును జైలుకు పంపించారా?  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినందుకు చంద్రబాబును బంధించారా? జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయడం ఆయన చేసిన నేరమా? సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారని ప్రశ్నించడం చంద్రబాబు తప్పా? ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా మన రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబును బంధించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరడం తప్పా? ఇసుక దోపిడీ, కల్తీ మద్యంపై మాట్లాడడం.. కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు తగ్గించాలని అడగడమే ఆయన చేసిన నేరమా?   కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల గురించే చంద్రబాబు ఆలోచించారు. పేదవాళ్లు శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు రావాలని కష్టపడ్డారు. 

మా అమ్మను బెదిరిస్తున్నారు

ఏనాడైనా మా అమ్మ బయటకొచ్చారా? చివరకు మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలకు మా అమ్మ రాలేదు. అసెంబ్లీ సాక్షిగా ఈ సైకో జగన్‌, ఆయన సైన్యం ఆమెను అవమానించారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు  నా తల్లికి తెలియదు. గవర్నర్‌ను కలిసేందుకు కూడా వెళ్లలేదు. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. భోజనాల్లో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు మా డీఎన్‌ఏలోనే లేవు. చంద్రబాబు ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !