- బీజేపీ అధికారంలోకి వస్తే ఇస్తామన్న ఈటల !
- బీఆర్‌ఎస్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ (BRS Party) పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajajender) పేర్కొన్నారు. దళితబంధు (Dalitbandu), బీసీ బంధు (BC Bandu) పేర్లు చెప్పి.. అన్నీ బంద్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ (Kcr) డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే అందరి కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని.. అధికారంలోకి వస్తే ప్రతి 6 నెలలకు ఓ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఈటల వెల్లడిరచారు.
తెలంగాణ ఏర్పాటుకు సహాకరించిన పార్టీ !
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌నాథ్‌సింగ్, సుష్మా స్వరాజ్‌లు ఆనాడు కోరారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణకు అనుకూలంగా 2007లోనే బీజేపీ తీర్మానం చేసిందని తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంటులో గర్జించిన వ్యక్తి సుష్మా స్వరాజ్ అని కొనియాడారు. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ బిల్లును పాస్ చేయించిన ఘనత తమ పార్టీదే అని ఈటల స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి పాల్గొన్న ఈటల ఈ మేరకు మాట్లాడారు. ఈ సందర్భంగా కమలాపురం ఓటర్లు తనను 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని ఈటల రాజేందర్ గుర్తు చేసుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. పైసలు, దావత్‌లు లేకుండానే అనేకసార్లు ఎన్నికల్లో గెలిచానన్న ఆయన.. తాను మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హాస్టల్‌లో విద్యార్థుల కష్టాలు తాను అనుభవించానన్నారు. అవన్నీ తనకు తెలుసని.. అందుకే తాను మంత్రి అయ్యాక హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చానని ఈటల గుర్తు చేశారు. వైద్య శాఖ మంత్రిని అయ్యాక ఆస్పత్రుల్లో వసతులు పెంచానని చెప్పారు.
నేను వారికి మద్దతివ్వడం కేసీఆర్‌కు నచ్చలేదు
హైదరాబాద్‌లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్‌కు నచ్చలేదని ఈటల అన్నారు. సమ్మె చేసిన 1,700 మందిని ఉద్యోగాల నుంచి కేసీఆర్ తొలగించారని.. ఉద్యమాల గడ్డగా పేరున్న ఇందిరా పార్కులో ధర్నాలు నిషేధించారని ధ్వజమెత్తారు. వీఆర్‌ఏలకు తాను మద్దతివ్వడం కేసీఆర్‌కు నచ్చలేదన్న ఈటల.. హుజూరాబాద్‌లో తనను ఓడిరచేందుకు కేసీఆర్ అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఓడిరచగలరా అని ఈటల వ్యాఖ్యానించారు. 2021లో హుజూరాబాద్ ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.
6 నెలలకో జాబ్ క్యాలెండర్
ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారని ఈటల విమర్శించారు. దళితబంధు, బీసీ బంధు పేర్లు చెప్పి అన్నీ బంద్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. గెలుపు కోసం కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారన్నారు. అందరి కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని.. అధికారంలోకి వస్తే ప్రతి 6 నెలలకు ఓ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడిరచారు.