BreakFast : టిఫెన్‌ ఏ టైమ్‌కి తీసుకుంటున్నారు ?

0

ఏం తింటున్నామనేదే కాదు, ఎప్పుడు తింటున్నామన్నదీ ముఖ్యమే. ఉదయం టిఫెన్‌ విషయంలో దీనికి మరింత ప్రాధాన్యముందని ఐఎస్‌గ్లోబల్‌ అధ్యయనం పేర్కొంటోంది. ఉదయం 9 గంటల తర్వాత టిఫెన్‌ చేసినవారితో పోలిస్తే ఉదయం 8 గంటల్లోపే టిఫిన్‌ తిన్నవారికి మధుమేహం ముప్పు 59% వరకు తగ్గుతున్నట్టు తేలింది. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ చేయకపోవటం, పొగ తాగటం వంటి కారకాలు టైప్‌ 2 మధుమేహం ముప్పు పెరిగేలా చేస్తుంటాయి. వీటికిప్పుడు మరోటీ జోడిరచుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అదే ఆహారం తినే సమయం. నిజంగానే తినే సమయం జీవ గడియారం (సర్కేడియన్‌ రిథమ్‌), రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ మోతాదుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని అధ్యయనాలే తిండి వేళల మీద దృష్టి సారించాయి. 

కొలెస్ట్రాల్‌ నియంత్రణ గతి తప్పుతుంది

ఈ నేపథ్యంలో ఆహార వేళల మధ్య ఎడమ, తినే సమయం, టైప్‌2 మధుమేహం మధ్య సంబంధాన్ని గుర్తించటానికి ఐఎస్‌గ్లోబల్‌ పరిశోధకులు ప్రయత్నించారు. మొత్తం 1,03,312 మంది ఆహార అలవాట్లను విశ్లేషించారు. తొలి రెండేళ్ల సగటు ఆహార పద్ధతుల ఆధారంగా ఏడేళ్లకు పైగా వారి ఆరోగ్య తీరుతెన్నులను పరిశీలించారు. వీరిలో కొత్తగా 963 మంది మధుమేహం బారినపడగా.. రోజూ ఉదయం 9 గంటల తర్వాత అల్పాహారం చేసినవారికి ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. శారీరకంగా చూస్తే ఇది సబబే. ఎందుకంటే అల్పాహారం మానేయటం వల్ల గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ నియంత్రణ గతి తప్పుతుంది. ఇన్సులిన్‌ హార్మోన్‌ మోతాదులూ అస్తవ్యస్తమయ్యే అవకాశమూ ఉంది. అల్పాహారమే కాదు. రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారికీ.. అంటే రాత్రి 10 గంటల తర్వాత తినేవారికీ మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తక్కువ తక్కువగా రోజుకు ఐదు సార్లు తినేవారికైతే ముప్పు తగ్గుతున్నట్టు బయటపడిరది. అలాగే ఎక్కువసేపు ఉపవాసం ఉన్నవారి విషయంలోనూ ఉదయం 8 గంటల్లోపు అల్పాహారం, పెందలాడే రాత్రి భోజనం చేస్తేనే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు తేలటం గమనార్హం. రోజులో తొలి ఆహారం ఉదయం 8 గంటల్లోపు, రాత్రి ఆహారం సాయంత్రం 7 లోపు చేస్తే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇలాంటి ఆహార పద్ధతితో రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతున్నట్టూ ఐఎస్‌గ్లోబల్‌ గతంలో నిర్వహించిన అధ్యయనంలోనూ వెల్లడైంది. మొత్తమ్మీద మధుమేహం, ఇతర సమస్యల నివారణకు ఆహారం, జీవ గడియారం, ఆరోగ్యం మధ్య సంబంధం (క్రోనోన్యూటిషన్‌) బలమైన ప్రభావం చూపుతున్నట్టు రుజువవుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !