ECE in Telangana : 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుండే ఓటు

0

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 7,600 మంది వందేళ్లు దాటిన ఓటర్లు ఉన్నారని వివరించారు కేంద్ర చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. తెలంగాణలో అక్టోబర్‌ 3 నుంచి 3 రోజులపాటూ పర్యటించింది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీలు, భద్రతా సిబ్బంది, పోలీసులు ఇలా చాలా మందితో సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో.. రాజీవ్‌ కుమార్‌ తాజా అప్‌డేట్స్‌ అందించారు. హైదరాబాద్‌, మినీ ఇండియా లాంటిది అన్న రాజీవ్‌ కుమార్‌.. 2022-23లో 22 లక్షల ఓట్లను తొలగించామని తెలిపారు. ఐతే.. ఏకపక్షంగా ఓటర్లను తొలిగించామని అనడం సరికాదన్న ఆయన... తమకు ఫామ్‌ వచ్చిన తర్వాతే తొలగించామని అన్నారు. పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామన్న రాజీవ్‌ కుమార్‌... అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్లు తెలిపారు.

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఈసీ

రాష్ట్రంలో మహిళలు, పురుషుల ఓట్లు దాదాపుగా చెరో 1.58 కోట్ల దాకా ఉన్నాయన్న రాజీవ్‌ కుమార్‌.. మహిళలు, పురుషులూ దాదాపు సమానంగా ఉన్నారని వివరించారు. 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కొత్తగా 8.11 లక్షల యువత తమ ఓట్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌ కీ యావరేజ్‌గా 897 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !