Chandrababu : రిమాండ్‌ పొడిగింపు, బెయిల్‌ విచారణ వాయిదా !

0

 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్‌ కస్టడీని విజయవాడ ఏసీబీ కోర్టు మరో రెండువారాలు పొడిగించింది. ఈ నెల 19 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో జ్యుడీషియల్‌ కస్టడీ ముగిసిన నేపథ్యంలో 14 రోజుల పాటు పొడిగించింది. 

బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారానికి వాయిదా

ఇదిలా ఉండగా.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కేసులో ఇరువర్గాల వాదనలను శుక్రవారం మధ్యాహ్నం వింటామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు బెయిల్‌, సీఐడీ పిటిషన్లపై బుధవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. గురువారం మరోసారి వాదనలు వింటామని న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. రెండురోజు ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. బాంబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌ కుమార్‌ దూబే వాదనలు వినిపించారు. సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చంద్రబాబు ఇచ్చిన గ్యారెంటీలపై ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు తెలుపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తయ్యిందని, బ్యాంకు గ్యారెంటీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చిందని పేర్కొన్నారు.

టీడీపీ ఖాతాలోకి నిధులు 

సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది స్కిల్‌ కార్పొరేషనే తప్ప.. ప్రభుత్వం కాదన్నారు. అక్కడ అవకతవకలు జరిగితే చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. మరో వైపు సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నైపుణ్య శిక్షణ పేరుతో నిధులను కొల్లగొట్టారంటూ కోర్టుకు పలు ఆధారాలను సమర్పించారు. డొల్ల కంపెనీల నుంచి నిధులు టీడీపీ ఖాతాలోకి వచ్చాయంటూ ఆధారాలు సమర్పించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 10న ఆడిటర్‌ను విచారణకు పిలిచామని, ఆయన వస్తానన్నారని ఏఏజీ కోర్టుకు తెలిపారు. స్కిల్‌ స్కామ్‌లో బాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని, ఆయనను కస్టడీకి ఇస్తే మరింత లోతుగా విచారణ జరుగుతుందన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !