Chandrababu : బయటకి వచ్చిన బాబు !

0

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టయి గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు ఎట్టకేలకు ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులు ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుండి నాలుగు గంటలకు చంద్రబాబు బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా జైలు వద్ద మోహరించి చంద్రబాబును స్వాగతించారు. చంద్రబాబు బెయిల్‌ పై విడుదల అవుతున్న కారణంగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద భారీగా తెలుగు తమ్ముళ్లు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. నారా లోకేష్‌, బ్రాహ్మణి, భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ తోపాటు నందమూరి కుటుంబం, నారా వారి కుటుంబం, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టిడిపి ముఖ్య నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు

చంద్రబాబు భావోద్వేగం

చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న అభిమానులు ఒక దశలో చంద్రబాబును చూడడానికి ఎగబడ్డారు. జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు టిడిపి శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ పేర్కొన్న ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూపించిన మద్దతు ఎప్పటికీ మరిచిపోను అన్నారు. మీరు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేనని పేర్కొన్న చంద్రబాబు రోడ్డుపైకి వచ్చి మీరు తెలిపిన సంఫీుభావం, నా కోసం మీరు చేసిన పూజలు ఎప్పుడు మరిచిపోను అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా, విదేశాలలోనూ తనకు సంఫీుభావం చూపించారని పేర్కొన్న చంద్రబాబు, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తాను చేపట్టిన విధానాల వల్ల లబ్ధి పొందిన వారంతా తనకు మద్దతు ఇచ్చారని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు సంఫీుభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జనసేన పార్టీ పవన్‌ కళ్యాణ్‌ కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన మద్దతును కొనియాడారు. ఎంతోమంది తన కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని, సైబర్‌ టవర్స్‌ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. వారందరిని అభినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 53 రోజుల జైలు జీవితంలో తాను అభివృద్ధి కోసం చేసిన పనులను, నాటి కష్టాన్ని నేమరువేసుకున్నానని అన్నారు.












కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !