Kcr in Dhaba : ఓట్ల కోసం దాబాలో చాయ్‌...ఓట్లు అయినంక ఫామ్‌హౌస్‌లో...

0

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... నాయకులు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నామో తెలిపేందుకు తాపత్రయ పడుతుంటారు. నేడు కేసీఆర్‌ సైతం అధికారం కోసం నానా పాట్లు పడుతున్నారు. సిద్ధిపేట, సిరిసిల్లలో బహిరంగ సభలు ముగించుకొని వెళుతూ సోనీ ఫ్యామిలీ దాబాలో వద్ద ఆగి చాయ్‌ తాగారు. నాయకులతో సరదాగా గడిపి ఛలోక్తులు విరిరారు. ఇక బహిరంగసభల్లో  ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తునే.. ప్రజలకు హామీలను గుప్పిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. వరుసగా మూడో రోజు సీఎం కేసీఆర్‌ రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఓట్ల కోసం మోసపూరిత మాటలు చెబుతూ అనేక మంది వస్తారని.. కాంగ్రెస్‌తో పెద్ద ప్రమాదం పొంచి వుందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభల్లో మాట్లాడిన గులాబీ దళపతి పొలిటికల్‌ పంచ్‌లతో విపక్ష పార్టీలపై ఫైర్‌ అయ్యారు. కుమారుడు కేటీఆర్‌ పోటీ చేస్తున్న సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సిరిసిల్లకు ఎమ్మెల్యేగా కేటీఆర్‌ ఉండటం ఈ ప్రాంత వాసుల అదృష్టమని అన్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికుల బతుకులు మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సిరిసిల్ల వాసులు కోరుకుంటున్నట్టుగా సిరిసిల్లను మరో సోలాపూర్‌గా మార్చుతామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

సిద్ధిపేట ఎంతో అభివృద్ధి

నేత కార్మికుల బతుకులు బాగుచేసేందుకు బతుకమ్మ చీరలు తెచ్చామని సీఎం కేసీఆర్‌ అన్నారు. వాటిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.సిరిసిల్ల నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వచ్చిన సీఎం కేసీఆర్‌ అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తనను నాయకుడిని చేసిన సిద్దిపేట రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు. తన సన్నిహితులను పేరు పేరునా గుర్తు చేసుకున్నారు. తాను వెళ్లినా సిద్ధిపేటకు ఆరుడగుల బుల్లెట్‌ ను అప్పగించానంటూ కేసీఆర్‌ హరీష్‌రావును కొనియాడారు. సిద్ధిపేట ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట బహిరంగ సభ నుంచి హైదరాబాదుకు వస్తూ మార్గ మధ్యలోని సోనీ ఫ్యామిలీ దాబాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాయ్‌ తాగారు. కొన్ని నిమిషాల పాటు కాన్వాయ్‌ ను ఆపిన సీఎం కేసీఆర్‌ టీ తాగుతూ సేద తీరారు.. సీఎం కేసీఆర్‌.. మంత్రి హరీష్‌ రావు, రాజ్యసభ ఎంపీ దామోదర్‌ రావు, ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులతో మాట్లాడుతూ.. కాసేపు గడిపారు.దాబాలో కాసేపు ఆగి చాయి తాగిన సీఎం కేసీఆర్‌.. అనంతరం హైదరాబాద్‌ పయనమయ్యారు. అయితే, తొలి విడత ప్రచారాన్ని రేపు జడ్చర్ల, మేడ్చల్‌ సభలతో సీఎం కేసీఆర్‌ ముగించనున్నారు. దసరా తర్వాత తిరిగి బహిరంగసభల్లో పాల్గొననున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !