Telangana : లగ్గం పిలుపుతో కాంగ్రెస్‌...కర్ణాటక రైతులతో బీఆర్‌ఎస్‌ రాజకీయం !

0

 

ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు...తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాలో మాటల యుద్ధానికి దిగుతున్నాయి. సోషల్‌ మీడియాలో ప్రత్యర్థి పార్టీలపై వినూత్నమైన దాడులు ఈ రోజుల్లో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.. మీమ్స్‌, పోస్టర్లు , సందేశాల రూపంలో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

లగ్గం పిలుపు ఆకట్టుకుంటోంది

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ తనదైన శైలిలో ‘బీజేపీ-బీఆర్‌ఎస్‌’ లగ్గం పిలుపుతో ఒక వెడ్డింగ్‌ కార్డును తయారు చేసి సోషల్‌ మీడియాలో వదిలింది, ఇది కాస్తా తెగ వైరల్‌ అవుతోంది. భారతీయ జనతా పార్టీ -భారత రాష్ట్ర సమితి మధ్య ఒక రకమైన అనుబంధం ఉందనే సందేశాన్ని ఓటర్లలో ప్రచారం చేయడానికి కాంగ్రెస్‌ అనేక సృజనాత్మక పోస్టర్‌లను వైరల్‌ చేస్తోంది. వ్యూహంలో భాగంగానే తెలంగాణ అమరవీరుల వేదనను తెలియజేసేలా ఈ పోస్టులు ఉండడం గమనార్హం. ఎన్నికలు జరిగే నవంబర్‌ 30న కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆహ్వానంలో పేర్కొన్నారు. అతిథులను చూసుకునే వారు కేటీఆర్‌, హరీష్‌ రావు, కవిత, కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, అరవింద్‌ అని పేర్కొనడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో కవిత జైలుకెళ్లకుండా ఉండేందుకు బిజెపి బిఆర్‌ఎస్‌ ఇస్తున్న కట్నం ఇది అని కాంగ్రెస్‌ ఆలోచింపచేసేలా ఈ పత్రికను డిజైన్‌ చేయడం విశేషం. ముహూర్తం ‘‘కవితపై కరుణ నక్షత్రంలో’’ అని కూడా పేర్కొనడం విశేషం.

పెళ్లిలో భాగంగా బీఆర్‌ఎస్‌ , బీజేపీ ఇప్పటికే ఏడు అడుగులు వేశాయని ఆహ్వానంలో పేర్కొంది. నోట్ల రద్దు వేళ మోడీ సర్కార్‌ కు మద్దతునిచ్చి కేసీఆర్‌ మొదటి అడుగు వేశాడని.. ఆ తర్వాత కాళేశ్వరం కుంభకోణానికి మోడీ మద్దతుతో రెండవ అడుగుబీ పెట్రోల్‌, డీజిల్‌ మరియు గ్యాస్‌ టాక్స్‌ స్కామ్‌లో పరస్పరం సహకరించుకోవడంతో మూడో అడుగుబీ ధరణి పోర్టల్‌ స్కాంతో నాలుగో అడుగుబీ బీఆర్‌ఎస్‌ ద్వారా లక్ష ఉద్యోగాలు మరియు మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వాగ్దానం చేయడంపై ఐదవ అడుగు టీఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం లీక్‌ స్కామ్‌లో సీబీఐ కేసులు నమోదు చేయకపోవడం ఆరో అడుగు.. ఏడవ అడుగుగా బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా బండి సంజయ్‌ను తొలగించి అతని స్థానంలో కిషన్‌ రెడ్డిని నియమించడం అంటూ జనాలను కన్విన్స్‌ చేసలా ఈ పెళ్లి పత్రికను డిజైన్‌ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కర్ణాటక రైతులతో కాంగ్రెస్‌ మోసాలను ఎండగడుతున్న బీఆర్‌ఎస్‌ !

కర్ణాటక రైతులను తెలంగాణ తీసుకొచ్చి కాంగ్రెస్‌ పాలనలో వారు పడుతున్న కష్టాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్‌ మాయలో పడొద్దని వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు. రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించటం సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్‌ ఇచ్చింది హామీలు కాదు, మోసాలు అంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో అమలు అవుతున్న పథకాల తీరుతో తెలంగాణలో ఎండకడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రులను మార్చటం, వ్యవసాయానికి కరెంట్‌ కట్‌, స్కీముల అమలులో లబ్దిదారుల కోత, నిబంధనల కొర్రీలు పెడుతున్న విధానాన్ని బీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి తీసుకెళుతోంది. రాబోయే రోజల్లో ప్రచారం ఇంకెన్ని వెర్రితలలు వేస్తుందో చూడాలి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !