Navdeep : డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు !

0

  


మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసులో ఇటీవలే నవదీప్‌ను నార్కోటిక్‌ బ్యూరో విచారించింది. అయితే ఆ కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన హాజరు కావాలని నవదీప్‌న జారీ చేసిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

కేసు ఎందుకంటే...

ఆగస్టు 31న మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్‌లో డ్రగ్‌ పార్టీ జరిగింది. సోదాలు నిర్వహించిన నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నిందితులు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ అనే నిందితుడి విచారణతో హీరో నవదీప్‌ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్‌ సైతం తనతో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు రామ్‌చంద్‌ తన వాంగ్మూలంలో వెల్లడిరచాడు. దీంతో టీఎస్‌ నాబ్‌ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్‌ వినియోగదారుల జాబితాలో తనను అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్‌ హైకోర్టులో సెప్టెంబర్‌ 15న పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 20 నవదీప్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌‍ను డిస్పోజ్‌ చేసింది. దీంతో నవదీప్‌ను సెప్టెంబర్‌ 23న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు నవదీప్‌ కొన్ని సరైన సమాధానాలు ఇవ్వగా.. మరికొన్నింటినీ దాటవేశారని తెలుస్తోంది. అయితే.. డ్రగ్స్‌ తీసుకోవడం తానెప్పుడో మానేశానని నవదీప్‌ చెప్పినట్టు తెలుస్తోంది. నిందితుడు రామచంద్‌ తనకు 10 ఏళ్ల క్రితమే పరిచయమని వెల్లడిరచారు. తాను ఎవరికి డ్రగ్స్‌ అందచేయలేదని నవదీప్‌ క్లారిటీ ఇచ్చారు. తాజాగా.. ఈ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇవ్వటంతో మరోసారి ఆయన చిక్కుల్లో పడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !