Fraud : ఎన్నికల కోడ్‌ ముసుగులో..కేటుగాళ్ళ కొత్త ఐడియాలు !

0

హైదరాబాద్‌ సిటీ నడిబొడ్డున.. పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇద్దరు కేటుగాళ్లు.. కొత్త ఐడియా వేశారు. సినిమాల్లో ధరించే పోలీస్‌ యూనిఫాం వేసుకున్నారు. పోలీసుల పాత్రల్లో రోడ్లపైకి ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు మోసగాళ్లు. వాహనాలను తనిఖీ చేశారు. నిజమైన పోలీసులు అనుకున్న వాహనదారులు.. తమ తమ వాహనాలను చూపించారు.

వ్యాపారి నుండి రూ.18 లక్షలు దోపిడి.

ఈ క్రమంలోనే బేగంబజార్‌ కు చెందిన ఓ వ్యాపారి.. పంజాగుట్ట వైపు వచ్చారు. అతని కారును తనిఖీ చేయగా.. అందులో 20 లక్షల రూపాయల డబ్బు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బుకు సంబంధించిన దీనికి లెక్కలు ఉన్నాయా.. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావ్‌.. ఎక్కడికి తీసుకెళుతున్నావ్‌ అంటూ నిజమైన పోలీసులు మాదిరిగానే ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నింటికీ లెక్కలు ఉన్నాయని చెప్పినా.. వినకుండా.. రూ. 18లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి డబ్బు తీసుకెళ్లు అంటూ ఆ ఇద్దరు కేటుగాళ్లు 18 లక్షల రూపాయలతో అక్కడి నుండి ఉడాయించారు. నడిరోడ్డుపై.. పోలీస్‌ వేషంలోని కేటుగాళ్ల వ్యవహారంతో ఆ వ్యాపారి బిత్తరపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి.. జరిగింది అంతా చెప్పారు. అప్పుడు కానీ అర్థం కాలేదు.. వాళ్లు నకిలీ పోలీసులు అని.. మొత్తానికి తెలంగాణ ఎన్నికల కోడ్‌.. కేటుగాళ్లకు కొత్త ఐడియాలు ఇస్తే.. వ్యాపారులకు మాత్రం షాక్‌ లు ఇస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు డూప్‌ పోలీసుల కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !