Harish Rao : రేవంత్​ని ఎప్పుడో ఓటుకు నోటు కేసులో జైలులో వేసేవారు

0

రానున్న ఎన్నికల్లోని సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా ఉన్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై హరీశ్‌ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో.. ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. ఉద్యమం సందర్భంగా కిషన్‌ రెడ్డి పదవికి భయపడి రాజీనామ కూడా చేయలేదని, ఇప్పుడు ఆయనకు అధికారం కట్టబెడితే ఎంత మేరకు అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు.

రేవంత్‌ జెల్లో ఉండేవారు...

కేసీఆర్‌ తలచుకుంటే రేవంత్‌ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలులో వేసేవారని కానీ పక్క రాష్ట్రాల్లాగా అలాంటి కుటిల రాజకీయాలు చేయబోమని మంత్రి హరీశ్‌రావు హితువు పలికారు. ఓటుకు నోటు, నోటుకు సీటు అనే వ్యక్తులను ప్రజలు నమ్మె ప్రసక్తే లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసిన రాబోయేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

‘‘సంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌ గెలిచే విధంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నాం. కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం లేదు. కేసీఆర్‌ తలచుకుంటే రేవంత్‌రెడ్డిని జైలులో వేసేవారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని జైలులో పెట్టేవారు. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా?. వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు. వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకు పంపిస్తారు. ఎన్ని ట్రిక్‌ లు చేసినా.. ఇసారి బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

నారాయణఖేడ్‌ నియోజికవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి.. వాళ్ల నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్‌లేదని.. అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్‌ తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలి దేవత.. ఇటలీ బొమ్మ అన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమెను దేవత అంటున్నాడని అన్నారు. రేవంత్‌ నోటికి మొక్కాలని విమర్శించారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని అన్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీటీం కాదని.. ప్రజలకు బీం టీం అని స్పష్టం చేశారు.

హారీష్‌ రావు ఏం చెప్పదలుచుకున్నారు ?

రేవంత్‌ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి కుటిల రాజకీయాలు, పగ చూపించటం లేదు. రేవంత్‌ రెడ్డిని జైలు కూడా పంపలేదు. మేము ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా కక్ష్య పూరిత రాజకీయాలకు దూరం అని చెప్పకనే చెప్పారు. మరింత లోతుగా వెళితే...మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. మీరు కూడా భవిష్యత్తులో మా మీద ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు అని ఇన్‌ డైరెక్ట్‌గా రేవంత్‌ రెడ్డికి మేసేజ్‌ ఇస్తున్నారా ? మరో వైపు బీజేపీ ఎమ్మేల్యే కొనుగోళ్ళ విషయంలో బీ.ఎల్‌.సంతోష్‌ అడ్డంగా ఇరుక్కుపోవటంతో ఇప్పుడు పార్టీనే బలి పెట్టాల్సి వచ్చింది. దిల్లీ లిక్కర్‌ కేసు విషయంలో బీజేపీ ఎలాంటి చర్యలు చేపట్టలేక పోయింది అని చెప్పవచ్చు. కేసీఆర్‌ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఎక్కడిక్కడ చర్యలు తీసుకోలేపోయింది. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే...ఒక పార్టీపై మరోక పార్టీ నాయకులు ఆరోపణలు మాత్రమే చేసుకుంటారు. అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోము అని ముందస్తు సూచనలు చేస్తున్నారు. ఇలా అయితే ప్రజాధనాన్ని ఎవరూ ఎంత దోచుకున్నా ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. అందరూ ఒక అడంర్‌ స్టాండిరగ్‌లో రాజకీయాలు నడుపుతున్నారు. ప్రజలే బలిపశువులు. ఇలాంటి రాజకీయాలను మార్చాలంటే పార్టీలకు సంబంధం లేని నిజాయితీ నాయకులను గెలిపించాల్సిందే. అప్పుడే ఈ సంప్రదాయ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ది చెప్పినట్టు అవుతుంది.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !