Heroin : పెళ్ళిపీటలెక్కే హీరోయిన్‌లు ఎవరు !?

0

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్‌లు అనేవి కామన్‌ అయిపోతున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్‌ కు మాత్రమే పరిమితం అయిన ఈ డేటింగ్‌ కల్చర్‌ ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. దాంతో ఇక్కడి హీరో, హీరోయిన్లు కూడా డేటింగ్‌లో మునిగి తేలుతున్నారు. అందులో కొందరు పెళ్లి పీటలెక్కుతున్నారు. కానీ మరికొందరు మాత్రం బ్రేక్‌అప్‌ చెప్పుకుంటున్నారు. మరికొందరు నో పెళ్ళి, జస్ట్‌ ఎంజాయ్‌ ద లైఫ్‌ అంటున్నారు. ఇప్పటికే చాలా సినీ జంటలు ఒక్కటైపోయాయి. అందులో కొన్ని జంటలు విడాకులు కూడా తీసుకున్నాయి. ఇప్పుడు కూడా కొన్ని జంటలు డేటింగ్‌లో ఉన్నాయి. వారెవరో ఇప్పుడు చూద్దాం.

తమన్నా-విజయ్‌ వర్మ

సౌత్‌ ఇండస్ట్రీలో మొన్నటి వరకు టాప్‌ హీరోయిన్‌ గా ఓ ఊపు ఊపేసింది తమన్నా. ఆమె అందాలకు ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇంత అందగత్తె అయిన ఈ భామ ఎంతోమంది ట్రై చేసినా పడలేదు. కానీ చివరకు నటుడు విజయ్‌ వర్మకు వర్కౌట్‌ అయింది అతనితో కొంత కాలంగా డేటింగ్‌లో ఉంది. లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ లోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డారు. అప్పటి నుంచే డేటింగ్‌ లో ఉన్న విషయాన్ని వీరిద్దరూ కన్ఫర్మ్‌ చేశారు. తమన్నా మొదటిసారి డేటింగ్‌ లో ఉంది. మరి ఇతన్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

రకుల్‌-జాకీ భగ్నానీ..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ కు వెళ్లాక ఎంతలా రెచ్చిపోతుందో మనకు తెలిసిందే. బాలీవుడ్‌ కు వెళ్లాక ఓ రేంజ్‌ లో అందాలను ఆరబోస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్‌ వాతావరనానికి తగ్గట్టు డేటింగ్‌ లో కూడా మునిగి తేలుతోంది. మొన్నటి వరకు సౌత్‌ ఇండియాను తన అందం, అభినయంతో ఊపేసింది ఈ భామ. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ మీద మోజుతో అక్కడకు వెళ్లిపోయింది. పైగా అక్కడ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో డేటింగ్‌ చేస్తోంది. అతనితో కలిసి పార్టీలు, పబ్బులకు వెళ్తోంది. అతన్ని పెళ్లి చేసుకుంటానని మాత్రం చెప్పట్లేదు. చూడాలి మరి ఏం చేస్తుందో.

రష్మిక-విజయ్‌ దేవరకొండ

సౌత్‌ స్టార్లు విజయ్‌ దేవరకొండ-రష్మిక చాలా కాలంగా డేటింగ్‌ లో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు ఎవరి దారుల్లో వారు బిజీగా ఉంటున్నారు. రష్మిక తన సినిమాలతో చాలా బిజీగా బాలీవుడ్‌ లో గడుపుతోంది. అప్పుడప్పుడు విజయ్‌ దేవరకొండ ఇంటికి సీక్రెట్‌ గా వస్తోంది. వీరిద్దరూ కలిసి సీక్రెట్‌ గా విదేశాలకు ట్రిప్‌ కు వెళ్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్‌ బాగా వినిపిస్తోంది. కానీ ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు ఈ జంట. చూస్తుంటే త్వరలోనే ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనన్యపాండే-కార్తీక్‌ ఆర్యన్‌..

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు బాలీవుడ్‌ లోనే బిజీ అవుతోంది. లైగర్‌ సినిమాతో ఆమె సౌత్‌ ఇండస్ట్రీని పలకరించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్లాప్‌ కావడంతో తిరిగి బాలీవుడ్‌ కు యూటర్న్‌ తీసుకుంది. అప్పటి నుంచి అక్కడే సినిమాలు చేసుకుంటూ వస్తోంది. అయితే ఆమె కొంత కాలంగా బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ తో డేటింగ్‌ చేస్తోందనే రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సీక్రెట్‌ గా ట్రిప్‌ లకు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సీక్రెట్‌ డేటింగ్‌ లో ఉన్నారు. కానీ తమ డేటింగ్‌ విషయాన్ని అధికారికంగా బయట పెట్టట్లేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !