Chandrababu : చంద్రబాబుకు సుప్రీంలో ఊరట దక్కే అవకాశం ఉందా ?

0

చంద్రబాబు జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారు ? రెండు తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త మరోకటి లేదంటే అతిశయోక్తి కాదు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ కేసులో తన పేరుని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు దక్కుతుందో అని తెలుగుదేశం శ్రేణులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కొంతమంది న్యాయనిపుణుల అంచనా ప్రకారం చంద్రబాబుకి అనుకూలంగా తీర్పు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. సెక్షన్‌ 17`ఏ రెట్రో యాక్టివ్‌గా వర్తిస్తుంది. 17`ఏ కింద చంద్రబాబుకి రక్షణ కల్పించాలి. 17`ఏ కింద కచ్చితంగా అనుమతి తప్పనిసరి కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఊహగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ఒకవేళ జైలు నుండి విడుదలైతే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో రాబోయే తీర్పుతో తెలంగాణలో కొందరి గెలుపు అవకాశాలు పూర్తిగా తారుమారైయ్యే అవకాశం ఉంది. 

తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించబోతున్న టీడీపీ, జనసేన ? 

మొన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, అమిత్‌షాలతో దిల్లీలో లోకేష్‌ భేటీ, నేడు జనసేన పవన్‌కళ్యాణ్‌తో పొత్తుపై చర్చలు...ఆంతర్యం ఏమై ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పొత్తులు సెట్‌ అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అలాగే కమ్మ సామాజిక వర్గం, ఐటీ ఎంప్లాయిస్‌ కూడా తెలుగుదేశానికి వెన్నుముకగా ఉంటోంది. ఈ ఓటర్లు అందరూ గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు మళ్ళే సూచలనలు కనిపిస్తుండటంతో బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అదే జరిగితే కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో కొనసాగి మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అధికార పార్టీని ఎదుర్కోవడానికి, కర్ణాటక ఫలితాల తదనంతర ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా సమస్త శక్తుల్నీ కూడగట్టుకుంటూ ఎన్నికల వైపు కదులుతోంది. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఆంధ్రా ఓటర్ల ప్రాబల్యం గణనీయంగా ఉంటుంది. వీరిని తమవైపు ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం తమకు కావాల్సిన సీట్లను డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ముందు షరతులు పెట్టింది. హైదరాబాదులో ఆంధ్రా సెట్లర్లూ, ఖమ్మం, నిజామాబాద్‌ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగస్తుల్లో టిడిపి సానుభూతిపరులు చాలామంది ఉంటారు. అసలే వార్‌ వన్‌ సైడ్‌ కాదని, అది టగ్‌ ఆఫ్‌ వార్‌ గా ఉంటుందని సర్వేలు చెబుతున్న ఈ సమయంలో ఒక్క ఓటును వదులుకున్నా అది శరాఘాతంలా పరిణమించవచ్చు. ఇలాంటి సమయంలో టిడిపి సానుభూతిపరులు కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా చూడడం అనివార్యం. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యక్షంగా టిడిపిని మద్దతు కోరలేదు. చంద్రబాబుకి కేసీఆర్‌ కి మధ్య ఉన్న వైరం అలాంటిది. అంతేకాదు ఇటీవల చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు చేసిన నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిషేధించి కేటీఆర్‌, చంద్రబాబుకు తమకు మధ్య ఉన్న స్పర్థను ప్రత్యక్షంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో టిడిపి మద్దతు దారులు కమ్మ సామాజిక వర్గం గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు మళ్ళకుండా బిజెపి తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్‌ చేస్తోంది. 

 50కి పైగా బీసీలకు సీట్లు ? బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల ?

తెలంగాణ వ్యాప్తంగా పార్టీలు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈ సందర్భంలో బీజేపీ బీసీ నినాదాన్ని తలకెత్తుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీలకు ముఖ్యమంత్రి పదవి నినాదం బీసీల్లో ఐక్యత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు బీసీ నాయకుడు ఆందరికీ ఆమోద యోగ్యుడు అయిన ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికలు హోరాహోరీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలకు తగినట్టు బీజేపీ తన రూటు మార్చుకుంటే బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ నడిచే ఛాన్స్‌ ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్‌కు షర్మిల రూపంలో ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతల మధ్య అనైక్యత బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !