రాజగోపాల్‌రెడ్డి ఏమన్నారంటే.. ?
ఈ ప్రచారంపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి నాపై పెరుగుతోంది’’ అని వెల్లడిరచారు. మెజారిటీ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం మంచిదని అభిప్రాయపడినట్లు సమాచారం. తాజాగా బీజేపీ 52 మందితో మొదటి జాబితా ప్రకటించింది. కానీ అందులో మునుగోడుకు అభ్యర్థిని ప్రకటించకుండా పెండిరగ్‌లో ఉంచింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. మరొకవైపు గడిచిన మూడు నాలుగు రోజులుగా ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తుల్లో భాగంగా మునుగోడు నుంచి ఒకవేళ సీపీఐ బరిలోకి దిగితే.. తాను స్వయంగా అక్కడ పోటీ చేస్తానని రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగితే.. తాను ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేస్తానని, తన భార్యకు మునుగోడు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి అడిగినట్లు సమాచారం. అయితే మునుగోడు నుంచే పోటీ చేయాలని, వేరే టికెట్ ఇచ్చేది లేదని బీజేపీ నాయకత్వం ఆయనకు స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.
కాంగ్రెస్‌లో రూట్ క్లియర్ !
రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరిక వరకు సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీటు విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఇవాళ, రేపట్లో అది కూడా స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడులో చెలమల కృష్ణారెడ్డి, ఉప ఎన్నికల్లో ఓటిమి చెందిన పాల్వాయి స్రవంతి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వారిద్దరి టికెట్లపై పీఠముడి పడిరది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి రాజగోపాల్ రెడ్డి వచ్చినట్లయితే అయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ వర్గాలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎల్బీనగర్ నుంచి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ పోటీ చేస్తారని ఆయనకే టికెట్ దక్కుతుందని ప్రచారం జరుగుతుండడంతో.. అక్కడ టికెట్లు ఆశించిన మల్రెడ్డి రామిరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డిలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో దిల్లీ పెద్దలను కలిసి మధుయాస్కీకి టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రామ్మోహన్ గౌడ్ చేరారు. ఈ నేపథ్యంలో మునుగోడులో కాకపోతే.. ఎల్బీనగర్ నుంచి అయినా రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దించుతారన్న ప్రచారం కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. ఇవాళ, రేపట్లో రాజగోపాల్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేసినట్లయితే.. ఈ ప్రచారాలన్నింటికీ తెరపడే అవకాశం ఉంది.