టాలీవుడ్‌లోనేకాదు, యావత్ సినిమా పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్ పెళ్లి. ఇండస్ట్రీ మొత్తంలో సల్మాన్ ఖాన్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ పేరు చెప్పుకొచ్చేస్తారు. ఈ ఏడాది పెళ్లి.. వచ్చే ఏడాది పెళ్లి అంటూ ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. కానీ, ప్రభాస్ మాత్రం పెళ్లి కబురు చెప్పడం లేదు. ఈ ఏడాది ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నా పెళ్లి ఎప్పడూ జరిగినా తిరుపతిలోనే చేసుకుంటా అని చెప్పడంతో.. దేవుడా.. అది త్వరగా వచ్చేలా చూడు అని మొక్కుకున్నారు.
త్వరలోనే ప్రభాస్ పెళ్లి
ఇక తాజాగా ఇదే విషయాన్నీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి మరోసారి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆమె విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించింది. ఇక అమ్మవారి దర్శనానంతరం శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ.. ’’ కృష్ణంరాజు గారు నాతోనే ఉన్నారు. నన్ను ముందుకు ఆయనే నడిపిస్తున్నారు. కృష్ణంరాజు గారి లెగసీని మేము ముందుకు తీసుకెళ్తున్నాం.. బాబు, నేను ఉన్నాం మీ అందరికి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపింది. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు .. ’’ త్వరలోనే బాబు పెళ్లి ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులతో, కృష్ణంరాజు గారి ఆశీస్సులతో బాబు పెళ్లి జరుగుతుంది. తప్పకుండా మీడియా వారందరిని పిలుస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వచ్చే ఏడాది అయినా ప్రభాస్ శుభవార్త చెప్తాడేమో చూడాలి.