Medigadda Barrage : కుంగింది మేడిగడ్డ కాదు, బీఆర్‌ఎస్‌ పునాదులు !

0

కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రకృతి పగపట్టిందా ? ప్రతిపక్షాలు చేయలేని పనిని ప్రకృతి చేస్తోందా ? అంటే నిజమే అనిపిస్తోంది. అది కూడా ఎన్నికలకు కరెక్టుగా 35 రోజుల ముందు...కేసీఆర్‌ కలల ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ వంతెన కుంగిపోవటం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పెద్ద కుదుపు. నాణ్యతాలోపం కారణంగానే లక్ష్మీ బ్యారేజ్‌ కుంగిపోయిందని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. గత వర్షాకాలంలో కాళేశ్వరం ముగిగిపోవటం, నేడు బ్యారేజ్‌ కుంగిపోవటంతో నాణ్యత ఏ పాటితో సామాన్యుడికి సైతం ఇట్టే అర్థం అవుతోంది.  బ్యారేజ్‌ క్రింద పునాదుల్లో బొగ్గు గనులు ఉండటం వలనే కుంగిపోయిందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ విషయం కేసీఆర్‌కు తెలిసే జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  

ప్రజాధనాన్ని నీళ్ళ పాలు చేశారు

మరో వైపు కాళేశ్వరం పంపులు మునిగిపోవటం ఇంజినీరింగ్‌ లోపాలను బయటపెడుతున్నాయని 130000 వేల కోట్లు ప్రజాధనాన్ని నీళ్ళ పాలు చేశారని ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రజాధనాన్ని కేసీఆర్‌ కుంటుంబం దోచుకుందని కాళేశ్వరం, మేడిగడ్డ సంఘటన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు 60 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఆ సీట్లు మరింత పెరిగి 90 దాకా వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కాంగ్రెస్‌ బలం కాదని, బీఆర్‌ఎస్‌ వ్యతిరేకతే అన్నది సుస్పష్టం అని గ్రహించాలి. అదే బండి సంజయ్‌ సారథ్యంలోని బీజేపీ ఈ సమయంలో గట్టిగా పోరాడితే కాంగ్రెస్‌ ప్లేస్‌లో బీజేపీకి సానుభూతి పవనాలు మళ్ళేవి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగటంతో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ..ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఆడుకుంటున్నాయి కాంగ్రెస్‌, బీజేపీ. మరి ఈ రెండు పార్టీల విమర్శలకు ఎలా గులాబీ బాస్‌ ఎలా కౌంటర్‌ ఇస్తారన్నది ఇప్పుటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కుంగిన వంతెనపై రాజకీయాలు..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతీష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో మరోసారి బీఆర్‌ఎస్‌ విమర్శలు ఎదుర్కొంటోంది. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఆలోచనతో చేపట్టిన ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ దగ్గర బ్యారేజ్‌ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగిపోయినట్లుగా ఇంజనీర్లు సైతం నిర్ధారించారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలను కూడా నిలిపివేశారు. ఈ వంతెన నిర్మాణం చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ మరమ్మతులు చేపడతామని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కచ్చితంగా ఇది నిర్మాణ లోపమేనని..దీని వెనుక అవినీతి జరిగిందని..టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి విమర్శల బాణం ఎక్కుపెట్టారు.

కేసీఆర్‌ ఫ్యామిలీనే మొదటి దోషి..

మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్‌ కుంగిపోవడానికి సీఎం కేసీఆర్‌ కుటుంబమే ప్రధాన కారణమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు నాణ్యత లోపం వల్లే కుంగిపోయిందని విమర్మించారు. కమిషన్ల కోసం భారీ ఎత్తున అవినీతి జరిగిందని..ఇందులో మొదటి దోషి కేసీఆర్‌ కుటుంబమని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగడంపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ తో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని వెల్లడిరచారు. మేడిగడ్డ ఘటనపై కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌, ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈసీకి లేఖ రాస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

అవినీతి జరిగిందని ఆరోపణ..

తెలంగాణ కాంగ్రెస్‌ కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిరదని ..మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్‌ కుంగిపోవడం వెనుక వాస్తవాలు ప్రజలకు తెలియాలని బీజేపీ ఆరోపిస్తోంది. ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికి మేలు జరిగిందని ..కేసీఆర్‌ ఎంత మేరకు నీటిని ఎత్తిపోశారని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి. మేధావులు, ఇంజనీర్ల సలహాలు కాదని ..తానే అద్భుతమైన ఇంజనీర్‌ని అని చెప్పుకున్న కేసీఆర్‌ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి నిర్మించడం వెనుక పెద్ద అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !