PM Modi : కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు: మోదీ

0

 

నిజామాబాద్‌ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్‌ ఢల్లీికి వచ్చి తనను కలిసినట్లు చెప్పారు. తనపై కేసీఆర్‌ ఎప్పుడు లేనంత ప్రేమ, అభిమానం కురిపించారని చెప్పారు. శాలువా, పూలతో తనను సత్కరించారని మోదీ తెలిపారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుందని..జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ చేయాలని కోరినట్లు మోదీ వెల్లడిరచారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రగతిలో దూసుకుపోతుందని.. తనను కూడా ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరినట్లు మోదీ తెలిపారు. కానీ కేసీఆర్‌ ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదన్నారు. తాము ప్రతిపక్షంలో అయినా  కూర్చుంటాం కానీ..తెలంగాణ ప్రజలను మోసం చేయమని చెప్పానన్నారు. కేసీఆర్‌.. కేటీఆర్‌ గురించి తనకు చెప్పారని మోదీ వెల్లడిరచారు. తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేసి..కేటీఆర్‌ ను సీఎం చేస్తానని చెప్పినట్లు తెలిపారు. కేటీఆర్‌ ను ఆశీర్వదించాలని కోరినట్లు మోదీ వివరించారు. కేటీఆర్‌ ఏమైనా యువరాజా..?  ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం అని చెప్పానన్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ కేసీఆర్‌ నా కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేదన్నారు. అప్పటి నుంచి కేసీఆర్‌ తనను కలవడం లేదన్నారు. అందుకే తాను తెలంగాణకు వచ్చినప్పుడల్లా..కేసీఆర్‌ తనను కలిసే ధైర్యం చేయడం లేదని మోదీ స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం 

తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. జనగర్జన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైంది. ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా భారతీయ రాష్ట్ర సమితి మార్చింది. రాష్ట్రం ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోంది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు మాత్రమే ధనికులయ్యారు. తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు. కాంగ్రెస్‌ పార్టీని దేశమంతా తిరస్కరించింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. ప్రజాస్వామ్య కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ కుటుంబ స్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు భాజపాను ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు.  కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లు రూపొందించుకున్నట్లు గుర్తు చేసిన ఆయన. భరతమాత రూపంలో సభకు వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు. ‘‘మహిళలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్‌లో మరింత మహిళా శక్తిని మనం చూడనున్నాం. తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలి. తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి. ప్రపంచానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన ఘనత తెలంగాణదే’’ అని మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని, కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. తెలంగాణ యువత కుటుంబ పాలనకకు మరో అవకాశం ఇవ్వొద్దని మోదీ పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !